Gun Fire : యువతి ఫోన్ నెంబర్ ఇవ్వలేదని తుపాకీతో వీరంగం సృష్టించిన యువకుడు.

ఆ యువతి భయంతో తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు.. గ్రామపెద్దలు చాన్ బాషాను కొట్టి మందలించాడు. అయితే పెద్దమనుషులు పెళ్లిచేసుకునే అమ్మాయి ముందే అతడిని కొట్టడంతో కోపంతో నాటు తుపాకీ తీసుకోని యువతి ఇంటి మీదకు వెళ్ళాడు.

Gun Fire : యువతి ఫోన్ నెంబర్ ఇవ్వలేదని తుపాకీతో వీరంగం సృష్టించిన యువకుడు.

Gun Fire

Gun Fire : పక్కింటి యువతి ఫోన్ నెంబర్ ఇవ్వలేదని వీరంగం సృష్టించాడో యువకుడు.. నాటు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కడపనతం గ్రామానికి చెందిన చాన్ బాషా అనే యువకుడు పక్కింటి యువతిని ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగాడు.

ఆ యువతి భయంతో తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు.. గ్రామపెద్దలు చాన్ బాషాను కొట్టి మందలించాడు. అయితే పెద్దమనుషులు పెళ్లిచేసుకునే అమ్మాయి ముందే అతడిని కొట్టడంతో కోపంతో నాటు తుపాకీ తీసుకోని యువతి ఇంటి మీదకు వెళ్ళాడు.

ఇంట్లో వారు వాగ్వాదానికి దిగడంతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ వెళ్లి పక్కింటి తలుపుకు తగలడంతో తలుపు ధ్వంసమైంది. భయంతో యువతి కుటుంబ సభ్యులు ఇంట్లోకి పరుగులు తీశారు. తెల్లారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. శనివారం ఫిర్యాదు అందుకున్న పోలీసులు చాన్ బాషాని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.