Nellore : ప్రేమించడం లేదని యువతి గొంతు కోశాడు.. నిందితుడిని పట్టుకున్నామన్న ఎస్పీ

వెంకటగిరిలో ఓ ప్రేమన్మాది యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. కాలేజిమిట్ట ప్రాంతంలో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. తనను ప్రేమించడం లేదన్న

Nellore : ప్రేమించడం లేదని యువతి గొంతు కోశాడు.. నిందితుడిని పట్టుకున్నామన్న ఎస్పీ

Crime

Young Boy Stabs Teenage Girl : ప్రేమించడం లేదని, పెళ్లి చేసుకోవడం లేదని.. ఇలాంటి కారణాలతో యువతులపై దారుణాలకు తెగబడుతున్నారు. ప్రేమోన్మాదులు రెచ్చిపోతూ చంపేస్తున్నారు. మాట్లాడుకుందామని చెప్పి.. కత్తులతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. దీంతో వారు తీవ్రగాయాల పాలై.. మృత్యువుతో పోరాడుతున్నారు. తమ కూతురు పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇలాంటి దాడులకు పాల్పడుతున్న ప్రేమోన్మాదుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఏకంగా యువతి ఇంటికి వెళ్లిన యువకుడు కత్తితో ఆమె గొంతుకోసి పారిపోయాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

Read More : Nalgonda : ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం…ప్రియుడు గల్లంతు

వెంకటగిరిలో ఓ ప్రేమన్మాది యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. కాలేజిమిట్ట ప్రాంతంలో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఉన్మాదానికి తెగపడ్డాడు చెంచుకృష్ణ అనే వ్యక్తి. బాధిత యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమోన్మాది కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు చెంచు కృష్ణ. తనను ప్రేమించాలంటూ వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధిత యువతి విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. వేధింపులకు గురిచేస్తున్న చెంచు కృష్ణను యువతి కుటుంబ సభ్యులు మందలించారు. అయినా బుద్ది మారని కృష్ణ యువతిని వేధిస్తూనే ఉన్నాడు. 2022, మార్చి 21వ తేదీ సోమవారం ఎవరూ లేని సమయంలో యువతి ఇంట్లోకి వెళ్లిన కృష్ణ.. యువతిపై కత్తితో దాడి చేశాడు. కేకలు వేస్తూ యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కేకలు విన్న స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది. దాడి అనంతరం ఇంటికి పారిపోయిన ప్రేమోన్మాది కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read More : Molestation : కన్నకూతుళ్లపై లైంగిక దాడి చేసిన కసాయి తండ్రి

దీనిపై… నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు మీడియాతో మాట్లాడారు. మైనర్ బాలికపై చెంచు కృష్ణ అనే వ్యక్తి కొన్నిరోజులుగా ప్రేమించాలని వెంటబడుతున్నాడని, కేవలం ప్రేమించలేదన్న కారణంగా కత్తితో గొంతుపై గాయపరిచాడన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి తరలించడం జరిగిందని కానీ.. మైనర్ బాలిక పరిస్థితి ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్ గా ఉందన్నారు. 354డి, 452, 324, 307, సెక్షన్ 9, 10 ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రేమ పేరుతో ఉన్మాద చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే నిందితుడిని పట్టుకోవడం జరిగినట్లు, నిందితుడు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడన్నారు. నిందితుడిని తొందరగా పట్టుకున్న వెంకటగిరి పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు తెలిపారు.