కరోనా ఎఫెక్ట్, పెళ్లి కాదేమోనని ఆత్మహత్య

కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తోంది. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఇంతవరకు వ్యాక్సిన్

  • Published By: veegamteam ,Published On : April 20, 2020 / 02:37 AM IST
కరోనా ఎఫెక్ట్, పెళ్లి కాదేమోనని ఆత్మహత్య

కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తోంది. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఇంతవరకు వ్యాక్సిన్

కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తోంది. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఇంతవరకు వ్యాక్సిన్ కనిపెట్ట లేదు. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు ఉన్న ఏకైక మార్గం లాక్ డౌన్ ఒక్కటే. దేశవ్యాప్తంగా కొన్ని వారాలుగా చాలా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలను ఇళ్లకు పరిమితం చేశారు. అత్యవసర పనులున్న వారినే రోడ్డుపైకి అనుమతిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక ఆదాయం లేక అవస్థలు పడుతున్నారు. తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా, లాక్ డౌన్ కారణంగా అనేక కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. కరోనా భయంతో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. మరికొందరు భవిష్యత్తుపై భయంతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.

తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటు చేసుకుంది. ధర్మవరంలోని శాంతినగర్‌లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవలే హేమావతి(25) అనే యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే కరోనా కారణంగా హేమ ఇంటిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో పెళ్లి కాదేమోనన్న భయంతో హేమావతి ఆత్మహత్య చేసుకుంది. కరోనా వైరస్ రాకపోయి ఉంటే, లాక్ డౌన్ విధించకపోయి ఉంటే, ఏప్రిల్ 25న హేమావతి పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. 

కేవలం 20మందితోనైనా వివాహం జరిపిద్దామని ఇరుపక్షాల పెద్దలు ఆలోచించారు. యువతి తల్లి మగ్గం పని చేస్తుంది. లాక్ డౌన్ కారణంగా పనులు నిలిచిపోవడంతో డబ్బు సర్దుబాటు కాలేదు. ఇక తన పెళ్లి ఇప్పట్లో కాదేమోనని ఆ యువతి మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హేమావతి మృతితో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.

Also Read | ఏప్రిల్ 20 నుంచి ఆఫీసుల్లో ఉద్యోగులు ఈ కొత్త నియమాలు పాటించాల్సిందే