Young Girl: పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదని ప్రియుడితో పారిపోతూ యువతి మృతి

కర్నూలు జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదంలో అరుణ అనే యువతి మృతి చెందింది. పెద్దలు కుదిర్చిన వివాహం కాదని ప్రియుడితో వెళ్లిపోతూ అరుణ చనిపోయింది.

Young Girl: పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదని ప్రియుడితో పారిపోతూ యువతి మృతి

Accident

Young Girl: కర్నూలు జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదంలో అరుణ అనే యువతి మృతి చెందింది. పెద్దలు కుదిర్చిన వివాహం కాదని ప్రియుడితో వెళ్లిపోతూ అరుణ చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. వెల్దుర్తి మండలం ఎంబాయి దగ్గర బైక్‌పై నుంచి పడి యువతి చనిపోయింది. ప్రియుడితో కలిసి వెళ్తూ ప్రమాదంలో మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అరుణకు నవంబర్ 19వ తేదీన వివాహం కుదిర్చారు. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన అరుణ.. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్ష్మిపురంకు చెందిన ప్రియుడు వెంకటేశ్వర్లుతో వెళ్తూ మృతి చెందింది. సర్టిఫికెట్ తీసుకునేందుకు వచ్చి ప్రియుడుతో వెళ్తూ మార్గమధ్యంలో బైక్ ప్రమాదంలో అరుణ చనిపోయింది.

ఘటన స్థలానికి చేరుకున్న డీఎస్‌పీ, సీఐ, ఎస్ఐ వివరాలను నమోదు చేసుకుని ప్రియుడు వెంకటేశ్వర్లుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.