Young Woman Murder : ప్రేమ పేరుతో యువతి హత్య

విజయవాడలో దారుణం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన యువకుడు ప్రేమ పేరుతో యువతిని ట్రాప్ చేసి చంపేశాడు.

10TV Telugu News

Young woman murder : విజయవాడలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువతిని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన యువకుడు ప్రేమ పేరుతో యువతిని ట్రాప్ చేసి చంపేశాడు. ఈ నెల 10న ఇంట్లో నుంచి యువతి వెళ్లి పోయింది. దీంతో యువతి తండ్రి కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

యూపీలోని సహరంపూర్ లో యువతి తండ్రి నిందితున్ని పట్టుకున్నారు. అతన్ని విచారించగా యువతిని హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఆ యువకుడిని సహరంపూర్ పోలీసులకు అప్పగించాడు.

స్థానిక పోలీసులు వస్తే కేసు ముందుకు సాగుతుందని..వెంటనే కొత్తపేట పోలీసులు యూపీకి రావాలని బాధితులు కోరుతున్నారు. యువకుడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటున్నారు.

10TV Telugu News