మీ ఇళ్లే మీ Big Boss ..బయటకు వెళ్లకపోవడమే మీ టాస్క్..కరోనాను ప్రారదోలుదాం

  • Published By: madhu ,Published On : March 27, 2020 / 05:24 AM IST
మీ ఇళ్లే మీ Big Boss ..బయటకు వెళ్లకపోవడమే మీ టాస్క్..కరోనాను ప్రారదోలుదాం

21 రోజులు..మీ ఇల్లే బిగ్ బాస్ హౌస్..కుటుంబసభ్యులే మీ హౌస్ మేట్స్..బయటకు రాకుండా ఉండటమే మీ టాస్క్..ఫ్యామిలీ కంటెస్ట్ంట్స్ తో రియల్ గేమ్..ఇన్ హౌస్ యాక్టివిటీస్ తో ఫన్ టైమ్..కరోనాను ఓడిస్తే..మీరే విన్నర్…మీ ఇంట్లో మీరే బిగ్ బాస్..21 డేస్ బిగ్ బాస్ హౌస్ ఛాలెంజ్ ..

బిగ్ బాస్ మీకు గుర్తుండే ఉంటుంది. బుల్లితెరపై ప్రసారమై ఎంతోమందిని ఆకట్టుకుంది. వివిధ భాషల్లో టెలికాస్ట్ జరిగింది. తెలుగులో రాత్రి 9గంటలకు ప్రసారయ్యేది. కరెక్టుగా ఈ సమయానికి చాలా మంది టీవీలకు అతుక్కపోయే వారు. దాదాపు కొన్ని నెలల పాటు హోస్ట్స్ ఇందులోనే ఉండిపోయేవారు. వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవు. ఇంట్లోనే ఉండిపోవాలి. కొన్ని సరదా సరదా గేమ్స్..ఇతరత్రా పోటీలుండేవి. చివరి వరకు ఉండి..గెలిచే వాడు విన్నర్ అవుతాడు. ఇదంతా గిప్పుడు ఎందుకు చెబుతున్నారు.

అనుకుంటున్నారు..కదా..ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాగే ఉండాలంటున్నారు. కానీ నెలల పాటు కాదు..కేవలం 21 రోజులు మాత్రమే. ఎందుకంటే..కరోనా రాకాసిని ప్రారదోలేందుకు ఈ విధంగా చేస్తే బెటర్ అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..ఇంట్లోనే ఉండి..ఏదో ఒకపని చేయాలని సూచిస్తున్నారు. కుటుంబసభ్యులతో సరదాగా గడపడం..ఏదో ఒక గేమ్స్ ఆడడం వల్ల టైం పాస్ అవుతుందంటున్నారు.

పిల్లలకు కూడా స్కూల్స్ సెలవలు కావడంతో..వారికి చదువు చెప్పడం..వారితో చిన్న చిన్న ఆటలు ఆడుకుంటే బెటర్ తెలియచేస్తున్నారు. మొక్కలు పెంచడం..ఉన్న చెట్లకు ఉదయం, సాయంత్రం నీళ్లు పోయడం..తదితర పనులు చేస్తే..ఇంటి నుంచి బయటకు రాకుండా వీలుంటుందని అంటున్నారు. ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు వస్తే..మాత్రం ఇంటి నుంచి వచ్చినా..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంటి సభ్యులనే కాపాడడమే కాకుండా..సమాజాన్ని కాపాడిన వారవుతారు. 21 రోజుల పాటు…ఇంట్లోనే ఉండి..కరోనా మహమ్మారిని ప్రారదోలుదాం..
 

Also Read | కరోనా ఎఫెక్ట్ : తాటాకులతో మాస్కులు తయారు చేసిన గిరిజనులు