Visakha Zoo : విశాఖ జూలో యువకుల ఓవరాక్షన్.. ప్రాణాలతో చెలగాటం

విశాఖ జూలో కొందరు యువకులు హల్ చల్ చేశారు. వన్య ప్రాణులతో ఆట్లాడేందుకు ప్రయత్నించి గాయపడ్డారు. అడవి పందుల ఎన్ క్లోజర్ లోకి దూకిన ముగ్గురు యువకులు వాటిని తరిమికొట్టారు. ఈ క్రమంలో అడవి పంది దాడికి దిగింది.

Visakha Zoo : విశాఖ జూలో యువకుల ఓవరాక్షన్.. ప్రాణాలతో చెలగాటం

Visakha Zoo

Visakha Zoo : విశాఖ జూలో కొందరు యువకులు హల్ చల్ చేశారు. వన్య ప్రాణులతో ఆట్లాడేందుకు ప్రయత్నించి గాయపడ్డారు. అడవి పందుల ఎన్ క్లోజర్ లోకి దూకిన ముగ్గురు యువకులు వాటిని తరిమికొట్టారు. ఈ క్రమంలో అడవి పంది దాడికి దిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి.

స్నేక్ జోన్, తాబేళ్ల ఎన్ క్లోజర్ లోనూ ఆ యువకులు హల్ చల్ చేశారు. వీటిని వీడియోలుగా తీసిన యువకులు వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. వీడియోలు వైరల్ కావడంతో అంతా యువకులపై మండిపడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగారు. వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద ఆరిలోవ పోలీసులు ఆ యువకుల మీద కేసు నమోదు చేశారు.