YS Jagan: వైఎస్ జగన్ స్పీచ్ పై వైసీపీ నాయకుల విస్మయం.. కారణం అదేనా!

వైఎస్ జగన్ ఈసారి అందుకు భిన్నంగా ప్రసంగించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. జగన్ స్పీచ్ చూసి వైసీపీ నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

YS Jagan: వైఎస్ జగన్ స్పీచ్ పై వైసీపీ నాయకుల విస్మయం.. కారణం అదేనా!

YS Jagan Mohan Reddy Speech: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో మూడో విడత వైఎస్సార్ ఆసరా (YSR Asara Scheme) నిధులను లబ్దిదారులకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని పునురుద్ఘాటించారు. గత నాలుగేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.2,25,330.76 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందజేశామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ప్రతిసారి ప్రతిపక్ష టీడీపీ, ఎల్లో మీడియాను ఏకిపారేసే వైఎస్ జగన్ ఈసారి అందుకు భిన్నంగా ప్రసంగించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఎటువంటి రాజకీయ విమర్శలు లేకుండానే సీఎం జగన్ ప్రసంగం సాగింది. ప్రతిపక్షాలపై విమర్శలు లేకుండా తనప్రసంగాన్ని ముగించారు. చంద్రబాబు నాయుడు పాలనలో డ్వాక్రా మహిళల పరిస్థితిని మాత్రమే తన ప్రసంగంలో ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళలకు ఎంత సాయం చేశామో వివరించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన ఎక్కువగా మాట్లాడారు. విపక్షాలు, ఎల్లో మీడియా (Yellow Media) ప్రస్తావన లేకుండా సాగిన జగన్ స్పీచ్ చూసి వైసీపీ నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

YS Jagan Speech

Also Read: ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. వైసీపీ నుంచి సస్పెన్షన్‌పై ఎమ్మెల్యే మేకపాటి సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థి అనూహ్యంగా ఓడిపోవడంతో అధికార పార్టీలో అంతర్మథనం మొదలైనట్టు కనబడుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తగలడంతో వైసీపీలో జోష్ తగ్గినట్టుగా కనబడుతోంది. నలుగురు ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించడం కూడా వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ప్రసంగంలో మార్పు చోటుకుని ఉండొచ్చని వైసీపీ నాయకులే అంటున్నారు. అయితే రాజకీయ వ్యూహాల్లోనే భాగంగానే ఈ మార్పు జరిగుండొచ్చన్న అభిప్రాయాన్ని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: మా ఇష్టారీతిలో ఓటేస్తామంటే కుదరదు.. జగన్ వెంటే నెల్లూరు ప్రజలు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీలో జోష్ నింపాయి. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా జనం మధ్యలో ఉంటూ ప్రతిరోజు ఏదోక కార్యక్రమం చేపడుతూ టీడీపీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. మరోవైపు నారా లోకేశ్.. యువగళం పేరుతో పాదయాత్ర కొనసాగిస్తూ వచ్చే ఏడాది ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. టీడీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన(JanaSena Party) పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విన్పిస్తున్నాయి. విపక్షాల దూకుడుతో అధికార పార్టీ డిఫెన్స్ లో పడినట్టుగా కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.