YS Jagan’s Delhi tour: ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌.. ప్రధాన ఎజెండా ఏమిటంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు(10 జూన్ 2021) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. వెంటనే అమిత్‌ షా, గజేంద్ర షెకావత్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

YS Jagan’s Delhi tour: ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌.. ప్రధాన ఎజెండా ఏమిటంటే?

Jagan to meet Union Home Ministers: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు(10 జూన్ 2021) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. వెంటనే అమిత్‌ షా, గజేంద్ర షెకావత్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. పోలవరం సహా ఏపీకి సంబంధించిన అంశాలపై మంత్రులతో జగన్ చర్చించనున్నట్టు తెలుస్తోంది.

అయితే మూడు రాజధానుల అంశం, పోలవరం ప్రధాన ఎజెండాగా జగన్ టూర్ ఉండనున్నట్టు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరకుంటారు జగన్‌. రెండు రోజుల క్రితమే జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. వాయిదాపడింది. అధికారిక ఎజెండాతో పాటుగా పొలిటికల్
అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సమస్యపై జగన్ దేశంలోని ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ముఖ్యమంత్రులు అందరిదీ ఒకే వాయిస్ అవ్వాలని.. కేంద్రమే బాధ్యత తీసుకోవాలని లేఖలో ప్రస్తావించారు. దీనిపైన ప్రధాని ఇప్పటికే స్పష్టత ఇచ్చేయగా.. రాష్ట్రానికి వ్యాక్సిన్‌లు విషయంలో ఈ టూర్‌లో చర్చించే అవకాశం ఉంది. ఇక, పోలవరం నిధుల విషయంలో ప్రధాని, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసినా ఇప్పటికీ నిధుల విషయంలో స్పష్టత రాలేదు.

అదేవిధంగా కరోనా కారణంగా ఏపీ ఏమేరకు నష్టపోయిందనే విషయాన్ని వివరించేందుకు జలశక్తి మంత్రి షెకావత్‌తో పాటుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను జగన్ కలవనున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అపాయింట్‌మెంట్ కోరారు జగన్‌. రాజ్‌నాథ్‌తో సమావేశంలో.. రఘురామ రాజు అంశం పైన జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రఘురామ రాజును సీఐడి విచారించిన సమయంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని, వాటిని సైతం కేంద్ర మంత్రులకు జగన్ వివరించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి అమిత్‌షా, జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్‌షెకావత్‌, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులను జగన్ కలవనున్నారు. పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాష్ జవదేకర్‌తో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది.