YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసు.. ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్

ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. దీనిలో భాగంగా ఇద్దరినీ సీబీఐ పలుమార్లు విచారించింది కూడా. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం అవినాష్ రెడ్డిని విచారించింది. విచారణ జరుగుతున్న తీరు చూస్తే, అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసు.. ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్

YS Avinash Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు.

APPSC Group 1: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా.. కారణం ఇదే!

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. దీనిలో భాగంగా ఇద్దరినీ సీబీఐ పలుమార్లు విచారించింది కూడా. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం అవినాష్ రెడ్డిని విచారించింది. విచారణ జరుగుతున్న తీరు చూస్తే, అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. దీంతో అవినాష్ రెడ్డి ముందు జాగ్రత్త చర్యగా తనను అరెస్టు చేయొద్దని కోరుతూ గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అతడిని అరెస్టు చేయకుండా తాము ఆదేశాలివ్వలేమని కోర్టు తెలిపింది. అవినాష్ రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Aadhaar-PAN Link : పాన్ ఆధార్ లింక్‌పై ట్విట్టర్‌లో మీమ్స్ ట్రెండింగ్.. నెటిజన్లు జోకులే జోకులు..!

ఈ కేసులో అధికారులు మళ్లీ అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి విచారణ సందర్భంగా ఆయనను అరెస్టు చేయొచ్చని భావిస్తున్నారు. అందుకే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ నెమ్మదిగా సాగుతుండటంపై భారత సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ ఎంతకాలం సాగదీస్తారని సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణాధికారిని మార్చడమో లేక మరో అధికారిని నియమించడమో చేపట్టాలని ఆదేశించింది.