YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. 4వ రోజు సీబీఐ విచారణ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది.

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. 4వ రోజు సీబీఐ విచారణ

Ys Viveka Case

YS Viveka Case : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. కంప్యూటర్ ఆపరేటర్ హిదయతుల్లా, మాజీ డ్రైవర్ దస్తగిరిలను సీబీఐ అధికారులు మరోసారి విచారిస్తున్నారు. అలాగే పులివెందులకు చెందిన మరికొంతమంది అనుమానితులు ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నిన్న వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరితో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్ గా పనిచేసిన హిదయతుల్లా, పులివెందులకు చెందిన కిరణ్‌కుమార్‌ యాదవ్‌లను పిలిపించి సీబీఐ అధికారులు ఏడు గంటల పాటు విచారించారు.

2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య వెలుగుచూసిన రోజు తొలుత మృతదేహాన్ని కంప్యూటర్‌ ఆపరేటర్ హిదయతుల్లా తన సెల్‌ఫోన్ లో ఫొటోలు తీసినట్లు అధికారుల దగ్గర ప్రాథమిక సమాచారం ఉందని, ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? బాత్రూమ్ నుంచి వివేకా మృతదేహం బెడ్‌ రూములోకి ఎవరు తరలించారు? రక్తపు మరకలు ఎవరు తుడిచారు? అనే సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.