Kadapa : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం, మరొకరి అరెస్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో 2021, సెప్టెంబర్ 09వ తేదీ గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది.

Kadapa : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం, మరొకరి అరెస్టు

Ys Viveka

YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో 2021, సెప్టెంబర్ 09వ తేదీ గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకానందరెడ్డి వ్యవసాయ పొలాలు చూసే పర్సనల్ అసిస్టంట్ జగదీశ్వర్ రెడ్డి తమ్ముడు ఉమా శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

Read More : Viveka Murder Case : వైఎస్ వివేకా హత్యకేసు విచారణకు హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి

ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో ఉమా శంకర్ అనుమానితుడిగా సీబీఐ అధికారులు భావిస్తున్నారు. కాసేపటి క్రితం ఇతడిని పులివెందుల కోర్టులో హాజరు పరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. అనంతరం కడప సెంట్రల్ జైలుకు ఉమా శంకర్ రెడ్డిని తరలించనున్నారు.

Read More : CBI : వైఎస్ వివేకా హత్య కేసు..సీబీఐ విచారణ 68వ రోజు

మరోవైపు..సిట్ బృందాన్ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణకు సిట్ బృందంలోని సభ్యుడు ఎస్ఐ జీవన్ రెడ్డి హాజరయ్యారు.
2019 మార్చిలో నెలలో ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. కడప కేంద్రంగా అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసులో పలువురిని అరెస్టు చేశారు.హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, కీలక డాక్యుమెంట్లను సీబీఐ సీజ్ చేసినట్లు సమాచారం. తర్వాత..వైఎస్ వివేకా హత్య ఎవరు చేశారో చెబితే..వారికి బహుమతి ఇస్తామని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సీబీఐ వెల్లడించడం చర్చనీయాంశమైంది.

Read More : YS Vivekananda Reddy Case : వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్..

కడప (Kadapa) జిల్లా కారాగారం, పులివెందుల ఆర్‌అండ్‌బీ (R&B) అతిథిగృహాల్లో సీబీఐ బృందాలు వేర్వేరుగా అనుమానితులను ప్రశ్నిస్తున్నాయి. కడపలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సుంకేసులకు చెందిన ఉమా శంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌ బంధువు భరత్‌ యాదవ్‌లతో పాటు మరికొంతమందిని ప్రశ్నించి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి విచారణ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో చూడాలి.