EXCLUSIVE: 10Tv చేతిలో కీలక ఆధారాలు.. వివేకాను హత్య చేసింది ఆ ముగ్గురే..!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు కనిపిస్తోంది. పులివెందులలోని వివేకా ఇంటి వాచ్‌మన్‌ రంగయ్య కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.

EXCLUSIVE: 10Tv చేతిలో కీలక ఆధారాలు.. వివేకాను హత్య చేసింది ఆ ముగ్గురే..!

Ys Viveka

YS Viveka Murder Case: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు కనిపిస్తోంది. పులివెందులలోని వివేకా ఇంటి వాచ్‌మన్‌ రంగయ్య కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. వాచ్‌మెన్ రంగయ్య కీలక వివరాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా హత్యపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు.

వైఎస్‌ వివేకాది హత్య అంటూ జమ్మలమడుగు కోర్టులో వాంగ్మూలం రికార్డు చేశారు. రెండున్నర గంటలపాటు కోర్టులో వాచ్‌మెన్‌ రంగయ్యను విచారించిన సీబీఐ అధికారులు.. అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. వివేక హత్య కేసులో తొమ్మిది మంది పాత్ర ఉందని, అందులో ఇద్దరు ప్రముఖులు ఉన్నట్లు రంగయ్య చెప్పినట్లు తెలుస్తోంది. సెక్షన్ 164 కింద రంగయ్య వాంగ్మూలం రికార్డు చేశారు.

44 రోజుల నుంచి వివేకా హత్యకేసును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. మూడు రోజుల నుంచి వాచ్‌మెన్ రంగయ్య విచారణకు హాజరవుతున్నాడు. నిన్న రంగయ్యను కోర్టులో హాజరుపరిచారు. విచారణలో రంగయ్య కీలక విషయాలు వెల్లడించాడు. రంగయ్య ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే, కోర్టులో ఏం ప్రశ్నించారు. తాను ఏం చెప్పానన్నది గుర్తు లేదని అంటున్నాడు రంగయ్య.

ఐపీసీ సెక్షన్ 164 కింద రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం రికార్డయ్యింది. ఈ సెక్షన్ ప్రకారం రికార్డు చేసిన వాంగ్మూలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోవడానికి కుదరదు. ఒకవేళ మాటమార్చితే వారిపైనా చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. అందుకే కీలక ఆధారాలు లభించినప్పుడు పోలీసులు ఈ సెక్షన్ కింద న్యాయమూర్తి సమక్షంలో వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారు. నేరాన్ని నిరూపించడంలో ఈ స్టేట్‌మెంటే కీలకం కాబోతోంది.

వాచ్‌మన్‌ రంగయ్యతో పాటు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయతుల్లా, మాజీ డ్రైవర్‌ దస్తగిరి, పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్‌ యాదవ్‌, కిరణ్ సోదరుడు సునీల్‌కుమార్‌ యాదవ్‌, తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రి, సోదరి నందిని, మైనింగ్‌ వ్యాపారి గువ్వల గంగాధర్‌, కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని లక్ష్మిరెడ్డి తదితరులను విచారించిన సీబీఐ.. రంగయ్య నుంచి కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం.

ముఖ్యంగా వివేకాను హత్య ముగ్గురే అని వాచ్‌మెన్ రంగయ్య చెబుతున్నారు. కోర్టులో వాంగ్మూలం తర్వాత ముగ్గురి పేర్లు చెప్పారు ప్రత్యక్షసాక్షి వాచ్‌మెన్ రంగయ్య. ఎర్ర గంగిరెడ్డి, సునీల్, దస్తగిరిలే వివేకాను చంపినట్లుగా చెప్పారు రంగయ్య. తన పేరు చెబితే చంపేస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి బెదిరించినాడని, అందుకే ఇన్ని రోజులు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదని చెప్పాడు రంగయ్య. అయితే, సీబీఐ అధికారులు తనకు భరోసా ఇవ్వడంతోనే వివరాలు చెప్పినట్లు రంగయ్య చెప్పుకొచ్చారు.