Raghurama Krishnam Raju : లోక్ సభ స్పీకర్‌‌కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ

లోక్ సభ స్పీకర్ కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ రాసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అనర్హత వేటు అంశంలో జాప్యం సరికాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Raghurama Krishnam Raju : లోక్ సభ స్పీకర్‌‌కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ

Loksabha

Raghurama Krishnam Raju : ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత వేటు విషయంలో వైసీపీ పార్టీ నేతలు మరింత జోరు పెంచారు. మొన్నటికి మొన్న లోక్ సభ స్పీకర్ కు వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రఘురామ అతిక్రమించారని ఆరోపించారు.

తాజాగా..లోక్ సభ స్పీకర్ కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ రాసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అనర్హత వేటు అంశంలో జాప్యం సరికాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. గత సంవత్సరం జులై 03వ తేదీన అనర్హత వేటు వేయాలని లేఖ ఇచ్చినా..ఇప్పటి వరకు చర్యలు లేవని తెలిపారు. ఫిర్యాదు చేసిన 11 నెలల తర్వాత..స్పీకర్ ఆఫీసు స్పందించిందన్నారు. అనర్హతకు గురి కావాల్సిన వ్యక్తి సభకు హాజరు కావడం నైతిక కాదని, పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలని లేఖలో విజయసాయిరెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్ పై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని, ఇకనైనా ఈ విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే..ఈ వ్యాఖ్యలను రఘురామ సమర్థించుకున్నారు. ప్రభుత్వంపై తాను చేసినట్లుగా చూడాలి..కానీ..పార్టీపై చేస్తున్నట్లుగా చూడొద్దని ఆయన సూచిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల కిందకు రాదని, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం లేదని ఆయన చెప్పుకొస్తున్నారు. దీనిపై స్పీకర్‌కు సైతం క్లారిటీ ఇచ్చారు.

తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జీఐడీ కేసు, రఘురామకృష్ణంరాజు అరెస్టు జరిగాయి. విడుదలైన అనంతరం జైలులో చిత్రహింసలకు గురి చేశారు..ఎంపీ అని చూడలేదని..గౌరవానికి భంగం కలిగిందని..సీఐడీపై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ కు రఘురామ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వివిధ కేంద్ర మంత్రులను కలవడం, సీఎంలకు లేఖలు రాయడంపై వైసీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రస్తుతం లోక్ సభ స్పీకర్ కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ రాయడంపై ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి మరి.