AP Legislative Council: మండలిలో 44కు చేరిన వైసీపీ బలం.. తగ్గనున్న టీడీపీ సభ్యుల సంఖ్య.. ప్రాతినిధ్యం కోల్పోయిన బీజేపీ

ఏపీ శాసన మండలిలో పార్టీల బలాలు మారనున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య పెరగనుంది. టీడీపీ సభ్యుల బలం తగ్గనుండగా, బీజేపీ ప్రాతినిధ్యం కోల్పోయింది . పీడీఎఫ్‌కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది.

AP Legislative Council: ఏపీ శాసన మండలి (AP Legislative Council) లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) బలం పెరగనుంది. టీడీపీ (TDP) బలం తగ్గనుండగా, బీజేపీ ((BJP)  ప్రాతినిధ్యం కోల్పోయింది.  గురువారం రాత్రి వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత శాసన మండలిలో పార్టీల బలాబలాలు మారిపోయాయి. మండలిలో సభ్యుల సంఖ్య మొత్తం 58గా ఉంది. వీరిలో అధికార పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 33 నుంచి 44 (గవర్నర్ కోటా సహా) సభ్యులకు చేరింది. గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఆరుగు సభ్యులు వైసీపీ గెలుచుకోగా, ఒక స్థానంలో టీడీపీ విజయం సాధించింది.

AP MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆరుగురి గెలుపు

తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఏడు, స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది, పట్టభద్రుల కోటాలో మూడు, ఉపాధ్యాయ కోటాలో రెండు మొత్తం 21 స్థానాలు ఖాళీ అయ్యాయి.  ఈ స్థానాలకు ఎన్నికల ప్రక్రియసైతం పూర్తయ్యింది. వీటిల్లో ఏకంగా 17 స్థానాలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోగా, టీడీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు బీజేపీకి శాసన మండలిలో ఉన్న ఒక్క సభ్యుడూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవటంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది. పీడీఎఫ్‌కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది.

Kinjarapu Atchannaidu : దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు, సీఎం జగన్ మాకే ఓటేశారేమో?- అచ్చెన్నాయుడు

ప్రతిపక్ష తెలుగుదేశం నుంచి ప్రస్తుతం శాసన మండలిలో 17 మంది సభ్యులు ఉన్నారు. అయితే, వీరి బలం పదికి తగ్గిపోనుంది. ఆ పార్టీకి చెందిన 11మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు, మే నెలాఖరుతో పూర్తికానుంది. ఆరుగురు పాతవారు ఎమ్మెల్సీ సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కొత్తగా టీచర్స్ ఎమ్మెల్సీలో ముగ్గురు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో ఒకరు మొత్తం నలుగురు ఎన్నికయ్యారు. వీరితో కలుపుకొని టీడీపీ సంఖ్యాబలం మండలిలో 10కి చేరుతుంది.

ట్రెండింగ్ వార్తలు