వైఎస్ఆర్ పెన్షన్ కానుక : మేలో వచ్చిన దరఖాస్తులు..మంజూరు వివరాలు

  • Published By: madhu ,Published On : June 20, 2020 / 06:08 AM IST
వైఎస్ఆర్ పెన్షన్ కానుక : మేలో వచ్చిన దరఖాస్తులు..మంజూరు వివరాలు

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు 2020, జూన్ 20వ తేదీ శనివారం పెన్షన్ కార్డుల పంపణీ ప్రారంభించారు. పెన్షన్ కార్డుతో పాటు పెన్షన్ పాస్ బుక్,  CM జగన్ సందేశం, పెన్షన్ మంజూరు ప్రోసిడింగ్స్ ను లబ్ధిదారులకు అందచేస్తున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన పత్రాలను సిద్దం చేశారు. శనివారం ఉదయం నుంచే గ్రామ, వార్డు వాలంటీర్లు కొత్త పెన్షన్ దారులకు సంబంధించిన ఈ నాలుగు పత్రాలను నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నారు. గతనెల 31వ తేదీ నాటికి పెన్షన్ల కోసం మొత్తం 1,30,487 దరఖాస్తులు వచ్చాయి. 

గత నెల (మే) 31వ తేదీ నాటికి వచ్చిన దరఖాస్తులు, మంజూరు వివరాలు : –

ప్రాథమిక పరిశీలనలో అర్హత లేనివి : 12,548 గా ఉన్నాయి. డిపార్ట్ మెంట్ల పరిశీలన కోసం పంపిన మిగిలిన దరఖాస్తులు 1,17,939 ఉండగా..వీటిని ఆయా డిపార్ట్ మెంట్లు పరిశీలించి వాటిల్లో 1,10,104 దరఖాస్తుదారులు అర్హులుగా తేల్చాయి. ఇక మిగిలిన 7835 దరఖాస్తులను అనర్హత కారణంగా డిపార్ట్ మెంట్లు తిరస్కరించారు. ఇలా మొత్తం తిరస్కరణకు గురైన దరఖాస్తులు : (12,548+7835) 20,383. వీటితోపాటు 5524 హెల్త్ పెన్షన్లు కూడా మంజూరు చేశారు.

డిపార్ట్ మెంట్లు తిరస్కరించిన 7835 దరఖాస్తులకు నిర్ధిష్ట కారణాలు ఇలా ఉన్నాయి.
– నిర్ధేశించిన ప్రమాణాలు లేని దరఖాస్తులు : 907
– శాశ్వత సదరం సర్టిఫికేట్ లేకపోవడం, తక్కువ అంగవైకల్యశాతం: 5
– వయోపరిమితి కారణాలు: 9
– పరిమితి కన్నా అధిక యూనిట్ల విద్యుత్ వినియోగం: 3972

– నాలుగు చక్రాల వాహనం కలగి వుండటం : 151
– కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి వుండటం : 333
– ఆదాయపన్ను చెల్లింపుల నిబంధన : 1485
– పరిమితికి మించిన భూమి కలిగి వున్న వారు : 973

Read: YSR Pension Kanuka : APలో నవశకానికి నాంది – మంత్రి పెద్దిరెడ్డి