YSR Pension Kanuka : APలో నవశకానికి నాంది – మంత్రి పెద్దిరెడ్డి

  • Published By: madhu ,Published On : June 20, 2020 / 05:54 AM IST
YSR Pension Kanuka : APలో నవశకానికి నాంది – మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేయడంలో సీఎం జగన్ నవశకానికి నాంది పలికారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో తన సుదీర్ఘ పాదయాత్ర సందర్బంగా అవ్వా, తాతలు, దివ్యాంగుల కష్టాలను స్వయంగా చూసిన జగన్ అధికారంలోకి రాగానే వారిని ఆదుకుంటానని ఇచ్చిన హామీని అక్షరాల అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. 2020, జూన్ 20వ తేదీ శనివారం ఫించన్ల పంపిణీ జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. 

YSR Pension : – 
అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద ప్రభుత్వం 2019 జూన్ 1వ తేదీ నుంచి సాధారణ పెన్షన్ దారులకు నెలకు రూ.2250లు, దివ్యాంగులకు రూ.3వేలు, సికెడియు (డయాలసిస్) పెన్షన్ల కింద రూ.10 వేలు పంపిణీ చేస్తోందని తెలిపారు.

60 ఏళ్లకు : – 
వృద్ధాప్య పెన్షన్ లకు 65 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు వయోపరిమితిని తగ్గించిందని గుర్తు చేశారు. 2020, జనవరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7.38 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో మొత్తం 58.82 లక్షల మంది పెన్షనర్లకు ప్రభుత్వం రూ.1476.34 కోట్లు పంపిణీ చేసిందని తెలిపారు. 

1.23 లక్షల మందికి పెన్షన్ : – 
ప్రభుత్వం ఈ ఏడాది మే 31వ తేదీ వరకు 1.23 లక్షల మందికి కొత్తగా పెన్షన్లను మంజూరు చేసింది. ఈ కొత్త పెన్షన్లను జూలై
1వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. అలాగే 10 రోజుల్లో దరఖాస్తు చేసుకున్న అర్హులకు పెన్షన్ మంజూరు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈనెల 1 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తుల్లో అర్హులైన 96,568 మందికి పింఛన్లు మంజూరు చేస్తున్నారు. వీరికి ఆగస్ట్ నెల నుంచి పింఛను అందించబోతున్నామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. 

టీడీపీ ప్రభుత్వంలో : – 
ఇదే పెన్షన్ల విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014, జూన్ నెలలో 43.43 లక్షల పెన్షన్లు ఇచ్చిందని, 2018, అక్టోబర్ లో మొత్తం 50.28 లక్షల మందికి రూ.వెయ్యి చొప్పున చంద్రబాబు సర్కార్ ఇచ్చిన పెన్షన్ రూ.552.56 కోట్లు మాత్రమేనని అన్నారు. టిడిపి ప్రభుత్వం మొదటి నాలుగేళ్ళలో కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు కేవలం 6.85 లక్షలు మాత్రమేనని అన్నారు. ఎన్నికలకు ముందు హడావుడిగా ఓట్ల రాజకీయం చేయడానికి 2019, ఫిబ్రవరిలో 53.83 లక్షల మందికి రూ.1133.15 కోట్లు ఫింఛన్ల కోసం ఆ ప్రభుత్వం ఖర్చు చేసిందని విమర్శించారు. 

Read: ఏపీలో నవశకం : ఫించన్ల పండుగ..10 పని దినాల్లో పెన్షన్