ఒక్కొక్కరికి రూ.7,500.. మే 13న వారి ఖాతాల్లోకి డబ్బులు

జగన్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌ కింద తొలి విడత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అర్హులైన రైతులకు మే 13న రూ.7,500 చొప్పున తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది.

ఒక్కొక్కరికి రూ.7,500.. మే 13న వారి ఖాతాల్లోకి డబ్బులు

Ysr Rythu Bharosa

Rythu Bharosa : జగన్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌ కింద తొలి విడత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అర్హులైన రైతులకు మే 13న రూ.7,500 చొప్పున తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది. గతేడాది లబ్ధిపొందిన వారితో పాటు గత రెండేళ్లుగా లబ్ధిపొందని అర్హుల కోసం ఏప్రిల్‌ 30వరకు దరఖాస్తుకు ప్రభుత్వం గడువిచ్చిన సంగతి తెలిసిందే.

వైఎస్సార్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌ కింద రైతులకు పీఎం కిసాన్‌ సాయం రూ.6వేలతో పాటు రైతుభరోసా కింద రూ.7,500 కలిపి మొత్తం రూ.13,500లు చొప్పున పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో అందిస్తోంది.

వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా అర్హులైన భూ యజమానుల ఖాతాల్లో మొదటి విడతగా మే నెలలో రూ.7,500లు, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4వేలు, జనవరిలో రూ.2వేల చొప్పున జమ చేస్తున్నారు. ఎలాంటి భూమి లేని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలురైతు కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న రైతు కుటుంబాలకు ఈ పెట్టుబడి సాయం అందిస్తోంది.

ఇందులో భాగంగా.. 2019-20లో 46లక్షల 69వేల 375 మంది రైతు కుటుంబాలకు రూ.6,173కోట్లు.. 2020-21లో 51లక్షల 59వేల 045 మందికి రూ.6,928 కోట్లు సాయం అందించారు. అలాగే, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ ఇతర ప్రభుత్వ భూములు సాగుచేస్తున్న వారు తొలి ఏడాదిలో 1,58,123 మంది, రెండో ఏడాది 1,54,171 మంది ఈ పథకం కింద లబ్ధిపొందారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఖరీఫ్‌ సాగు నిమిత్తం తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది ప్రభుత్వం.