YSRCP Plenary : నవ సందేహాలు అన్న వాళ్లు నవరంధ్రాలు మూసుకున్నారు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాల గురించి వ్యాఖ్యానించిన వారు   రెండు రోజుల ప్లీనరీ చూసిన తర్వాత నవ రంధ్రాలు మూసుకున్నారని  వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. 

YSRCP Plenary : నవ సందేహాలు అన్న వాళ్లు నవరంధ్రాలు మూసుకున్నారు

Vijayasai Reddy

YSRCP Plenary : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాల గురించి వ్యాఖ్యానించిన వారు   రెండు రోజుల ప్లీనరీ చూసిన తర్వాత నవ రంధ్రాలు మూసుకున్నారని  వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.  గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద రెండు రోజుల పాటు జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి ఆయన ధన్యావాదాలు తెలియచేశారు.

వర్షాన్ని కూడా లెక్కచేయకుండా సుమారు 9 లక్షల మంది ప్లీనరీకి తరలి వచ్చారని ఆయన చెప్పారు. ప్లీనరీకి వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబు నాయుడు కుళ్లి కుళ్లి ఏడుస్తున్నాడని ఆయన అన్నారు. వైసీపీ ప్లీనరీ చరిత్రలో సువర్ణ  అధ్యాయంగా నిలిచిపోతుందని విజయసాయిరెడ్డి చెప్పారు. టీడీపీ మహానాడులో తిట్టటం, తొడలు కొట్టటమే ప్రధానంగా జరిగేదని… మా ప్లీనరీలో మూడేళ్లలో ఏమేం చేశాము, రాబోయే రెండేళ్లలో ఏమేం చేస్తామో చెప్పామని ఆయన అన్నారు.

జగన్ ను చంద్రబాబు ఎందులోనూ ఎదుర్కోలేడని,  రాష్ట్రంలో అమలు చేస్తున్న నవరత్నాలను విమర్శించిన వారికి నిన్నటితో  నవ రంధ్రాలు మూత పడ్డాయని ఆయన అన్నారు. టీడీపీ జనసేనలకు 2024 లో బుద్ది చెప్పటానికి ప్రజలు సిధ్దంగా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు.  చంద్రబాబుకు బ్రెయిన్ లేదని… ప్రజల్ని నిందిస్తున్నాడని ఆయన ఆరోపించారు.

రోషం లేదా… పౌరుషం లేదా.. అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నాడని విజయసాయిరెడ్డి అన్నారు. నెగిటివ్ భావాలతో, మానసిక ఆవేదన అనే తీవ్రమైన జబ్బుతో బాధ పడుతున్న చంద్రబాబు .. ప్రతిపక్ష నాయకుడుగా ఉండడానికి అర్హుడు కాదని ఆయన వివరించారు. విజయమ్మ ఎందుకు రాజీనామా చేశారో క్లియర్ గా వేదిక మీద నుంచి చెప్పారని.. దీనికి రాజకీయ రంగు పులమడం చంద్రబాబు కే సాధ్యం అని ఆయన పేర్కోన్నారు.

జగన్ నీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నది మా  పార్టీ  కార్యకర్తలని ఇందులో అప్రజాస్వామికం ఏముందో అర్ధం కావటం లేదని ఆయన ప్రశ్నించారు. వైఎసీపీ ప్లీనరీకి వచ్చి తిరిగి వెళుతూ బస్సు కిందపడి మరణించిన వేమూరుకు చెందిన   కార్యకర్త కుటుంబానికి ఐదు  లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు విజయసాయి రెడ్డి చెప్పారు.