Kodali Nani : ఆసుపత్రిలో ఎమ్మెల్యే కొడాలి నాని.. సర్జరీ చేసిన డాక్టర్లు

కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడిన మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి శస్త్ర చికిత్స జరిగింది. కిడ్నీలో రాళ్లు ఉండటంతో లేజర్ ట్రీట్ మెంట్ ద్వారా కొడాలి నానికి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సర్జరీ చేశారు డాక్టర్లు.

Kodali Nani : ఆసుపత్రిలో ఎమ్మెల్యే కొడాలి నాని.. సర్జరీ చేసిన డాక్టర్లు

Kodali Nani : కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడిన మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి శస్త్ర చికిత్స జరిగింది. కిడ్నీలో రాళ్లు ఉండటంతో లేజర్ ట్రీట్ మెంట్ ద్వారా కొడాలి నానికి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సర్జరీ చేశారు డాక్టర్లు. రెండు నుంచి మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి కొడాలి నాని డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కొడాలి నానికి డాక్టర్లు సూచించారు. 15 రోజుల తర్వాత అంతా బాగుంటే, శస్త్ర చికిత్సలో భాగంగా వేసిన స్టెంట్ ను రిమూవ్ చేయనున్నట్లుగా వైద్యులు వెల్లడించారు.

ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారు కొడాలి నాని. కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జగన్ మీద నమ్మకం లేదా? హైదరాబాద్ పరిగెత్తావ్
కాగా, కొడాలి నాని చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లడంపై టీడీపీ విమర్శలు చేసింది. ”నీకు కరోనా వస్తే ఏపీలో కరోనాను భూస్థాపితం చేసిన జగన్ అనే వ్యాక్సిన్ ఉండగా.. హైదరాబాద్ కు ఎందుకు పరిగెత్తావ్? నీకు రోగమొస్తే ఏపీలో వైద్య రంగానికి పెద్దపీట వేసిన జగన్ ఉండగా మళ్లీ పక్క రాష్ట్రానికి పరిగెత్తావు. జగన్ దగ్గర విశ్వాసం గల జీవిలా పడి ఉండే నీకే జగన్ మీద నమ్మకం లేదా? మరెందుకు ఈ పనికిమాలిన మాటలు?” అని ట్వీట్ చేసింది.