MLA Sridevi : వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా, ఆ వార్తల్లో నిజం లేదని వివరణ

గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ చేరడంతో ఆమెను ఐసీయూలో చేర్చి

MLA Sridevi : వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా, ఆ వార్తల్లో నిజం లేదని వివరణ

Ysrcp Mla Undavalli Sridevi Tested Corona Positive

MLA Sridevi : గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ చేరడంతో ఆమెను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారనే వార్తలపై ఎమ్మెల్యే కార్యాలయం స్పందించింది.

ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కార్యాలయం సిబ్బంది చెప్పారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఎమ్మెల్యే కార్యాలయం ఖండించింది. ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా పాజిటివ్‌గా తేలిన మాట వాస్తవమేనని.. అయితే అశ్రద్ధ చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించిందంటూ కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోగ్యం నిలకడగానే ఉందని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రీదేవి చికిత్స తీసుకుంటున్నట్లు వివరించారు. త్వరలోనే ఎమ్మెల్యే శ్రీదేవి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని.. అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు.