Mithun Reddy : చంద్రబాబు చెప్పినట్టే.. జగన్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోంది

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ పై ఆ పార్టీ ఎంపీలు ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగానే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారని వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి ఆరోపించారు. ఆయనకు దెబ్బలు తగల్లేదని.. ఎవరూ కొట్టలేదని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో డాక్టర్లు తెలిపారని చెప్పారు. తనను కొట్టారంటూ రఘురామ కుట్ర చేస్తున్నారని.. బెయిల్ రాలేదని తెలిసే ఆయన కొత్త నాటకానికి తెరతీశారని మిథున్‌రెడ్డి ఆరోపించారు.

Mithun Reddy : చంద్రబాబు చెప్పినట్టే.. జగన్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోంది

Mithun Reddy

Mithun Reddy : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ పై ఆ పార్టీ ఎంపీలు ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రఘురామ అరెస్ట్ చట్టప్రకారమే జరిగిందని వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అసలు రఘురామను ఎందుకు అరెస్ట్ చేశారనే విషయాన్ని డైవర్ట్ చేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రఘురామను ఆయన కుటుంబసభ్యులను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని అన్నారు. నిబంధనల ప్రకారమే రఘురామ అరెస్ట్, జైలుకి తరలింపు జరిగిందన్నారు.

చంద్రబాబు చెప్పినట్లుగానే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారని వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి ఆరోపించారు. ఆయనకు దెబ్బలు తగల్లేదని.. ఎవరూ కొట్టలేదని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో డాక్టర్లు తెలిపారని చెప్పారు. తనను కొట్టారంటూ రఘురామ కుట్ర చేస్తున్నారని.. బెయిల్ రాలేదని తెలిసే ఆయన కొత్త నాటకానికి తెరతీశారని మిథున్‌రెడ్డి ఆరోపించారు.

టీడీపీ నేతలు అరెస్టయినా రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ రాయలేదని.. పెద్ద కుట్రతోనే ఆయన ఇప్పుడు లేఖ రాశారని అన్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందన్నారు. ఈ వ్యవహారాలను లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తామని మిథున్‌రెడ్డి చెప్పారు.

తమ కుట్ర బయటపడుతుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు రఘురామకృష్ణమరాజు అరెస్ట్ పై హడావిడి చేస్తున్నారని మిథున్ రెడ్డి అన్నారు. అచ్చెన్నాయుడు గానీ ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి అరెస్టయినప్పుడు కానీ, చేయని హడావుడి.. రఘురామకృష్ణమరాజు అరెస్టుపై చంద్రబాబు చేయడం అందులో భాగమేనని ఆయన అన్నారు.

రఘురామకృష్ణమరాజు చంద్రబాబు ట్రాక్ లో పడ్డారని, చంద్రబాబు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని మిథున్ రెడ్డి అన్నారు. కుట్రలో పాలు పంచుకున్నవారంతా బయటకు రావాల్సిందేనని అన్నారు. సీఎం జగన్ రఘురామకు ఇచ్చిన గౌరవం ఇతర పార్టీ ఎంపీలకు ఎవరికీ ఇవ్వలేదని అన్నారు. రఘురామకృష్ణమరాజు విమర్శల్లో కుట్ర కోణం ఉందన్నారు.

మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టాలని, ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్ర చేశారని, దాని వల్ల ప్రజలు నష్టపోతారని ఆయన అన్నారు. కుట్ర బయపడుతుందనే చంద్రబాబు రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. ఓ ఎంపీని అరెస్టు చేయకూడదని ఎక్కడా లేదని, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు అరెస్టు చేసిన విషయాన్ని స్పీకర్ కు తెలియజేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అప్పుడు మాత్రమే స్పీకర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

బీజేపీకి దగ్గరై తనపై ఉన్న సీబీఐ కేసుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో హిందూ దేవాలయాల గురించి తొలుత రఘురామకృష్ణమరాజు మాట్లాడారని, అది పారకపోవడంతో కుల ప్రస్తావన చేస్తూ వచ్చారని ఆరోపించారు.