Graduate MLC Elections: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వైసీపీ.. ఎమ్మెల్యేలతో ఏకీభవించిన సీఎం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఎమ్మేల్యేలంతా ఏకాభిప్రాయంతో పోటీ చేసేందుకు అనుమతి కోరగా సీఎం ఆమోదించారు. గతంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఈ సారి పోటీ చేద్దామని సూచించారు.

Graduate MLC Elections: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వైసీపీ.. ఎమ్మెల్యేలతో ఏకీభవించిన సీఎం

Cm Jagan

Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఎమ్మేల్యేలంతా ఏకాభిప్రాయంతో పోటీ చేసేందుకు అనుమతి కోరగా సీఎం ఆమోదించారు. గతంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఈ సారి పోటీ చేద్దామని సూచించారు.

ప్రాంతాల వారీగా సమావేశం:

సచివాలయంలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశమ్యారు. మొదటిగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలున్న ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలున్న ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. తదుపరి ఒక గ్రాడ్యుయేట్, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలుఉన్న ఉమ్మడి ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడారు.

ఈ సమావేశాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై సంబంధిత జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు స్వీకరించి ముఖ్యమంత్రి సమ్మతిని తెలియజేశారు. వచ్చే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఏకాభిప్రాయాన్ని ఆమోదించారు.

Read Also: రాజకీయ లబ్ధి కోసం గౌరవాన్ని మీడియాకీడ్చారు – వైఎస్సార్సీపీ

సీఎంకు విన్నపం

“ఎవరోఒకరికి మద్దతు ఇవ్వడమో, ఉత్సాహం ఉన్నవాళ్లు ముందుకొస్తే వారికి అండగా నిలబడ్డమో చేశాం. శాసనమండలిలో ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయాలకు మన మద్దతుతో గెలిచిన వారుకూడా నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మనం పోటీచేయడమే మంచిది” అని ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయంతో సీఎంకు విన్నవించారు.

ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అంగీకరించిన సీఎం… గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలను గతంలో ప్రాధాన్యతగా తీసుకోలేదన్నారు. ఈ సారి మాత్రం గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉన్న ఎన్నికల్లోకి మనం వెళ్తున్నామని ఎమ్మెల్యేలకు సూచించారు. ముందుగా ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని పిలుపునిచ్చారు.

అభ్యర్థుల ఖరారు

ఎమ్మెల్యేల అభిప్రాయాలతో మూడు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారుచేసేశారు. ఉమ్మడి విశాఖ – విజయనగరం – శ్రీకాకుళం గ్రాడ్యుయేట్‌ స్థానానికి ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న ఎస్‌. సుధాకర్‌ పేరు ఖరారైంది. ఉమ్మడి ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానానికి సంబంధించి గూడూరు నియోజకవర్గానికి చెందిన శ్యాంప్రసాద్‌రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు–కడప– అనంతపురం గ్రాడ్యుయేట్‌ స్థానానికి సంబంధించి వెన్నపూస రవి పేరు ఖరారైంది.

సీఎం టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్ణయాన్ని వాయిదావేశారు. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల ప్రక్రియ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. పోటీల్లో పాల్గొనే అభ్యర్థులను తర్వాత పరిశీలిద్దామని సమావేశంలో నిర్ణయించారు.