Seediri Appalaraju : వచ్చే ఎన్నికల్లో 175 స్ధానాలు వైసీపీవే- మంత్రి సీదిరి అప్పలరాజు

రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175 స్ధానాలు కైవసం చేసుకుంటుందని మంత్రి సీదిరి అప్పలరాజు విశ్వాసం వ్యక్తం చేశారు.

Seediri Appalaraju : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ, అప్పుడే ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోసారి అధికారం నిలుపుకోవాలని వైసీపీ, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ పట్టుదలగా ఉన్నాయి. ఈసారి అధికారంలోకి వచ్చేది మేమంటే మేమే అని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ దూకుడుగా వెళ్తోంది. రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని, 175 స్థానాలనూ కైవసం చేసుకుంటామని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175 స్ధానాలు కైవసం చేసుకుంటుందని మంత్రి సీదిరి అప్పలరాజు విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీకి కార్యకర్తలే బలం అన్నారాయన. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించినప్పుడే 2024 ఎన్నికల శంఖారావం పూరించామన్నారు. మూడేళ్లలోనే ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన వాటిలో 95 వాగ్దానాలను అమలు చేశామన్నారు. మరో రెండేళ్లలో ఇచ్చిన హామీలతో పాటు ఇతర పథకాలను అమలు చేస్తామన్నారు. ఆ ధైర్యంతోనే ఎన్నికలకు వెళతామని, 175 స్ధానాలు సాధిస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

lakshmi parvathi: చంద్రబాబుకు ఈ వయసులో పనేముంది?: లక్ష్మీ పార్వతి

మాజీమంత్రి కన్నబాబు..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై మాజీమంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ ఎన్ని కలలు కన్నా.. ఎన్ని ‌కుట్రలు పన్నినా అధికారంలోకి రాలేరని ఆయన తేల్చి చెప్పారు. 2019లో అలాంటి ప్రగల్భాలు పలికి బొక్క బోర్లా‌పడ్డారని గుర్తు చేశారు. నవరత్నాల్లో కోత అంటూ పవన్ కళ్యాణ్ అసత్య ప్రచారం చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. పవన్ కు స్క్రిప్టు ఇచ్చేవారు తప్పుగా అందిస్తున్నట్లున్నారని ఎద్దేవా చేశారు. పవన్ బయటకొచ్చి నవరత్నాల్లో ఎక్కడ కోత పడిందో చెప్పాలన్నారు. వైసీపీపై అసత్యాలు ప్రచారాలు చేస్తే కార్యకర్తలే బుద్ధి చెబుతారని కన్నబాబు హెచ్చరించారు. గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన సీట్లు, ఓట్ల శాతం కంటే.. 2024 ఎన్నికల్లో మరింత ఎక్కువుగా సాధిస్తామని కన్నబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

vijaya sai reddy: షర్మిలమ్మ పార్టీ కోసం విజయమ్మ వెళ్తున్నారు: విజ‌య‌సాయిరెడ్డి

రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య..
సీఎం జగన్ పై రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసల వర్షం కురిపించారు. బీసీలకు సముచిత స్ధానం కల్పించిన వ్యక్తి జగన్ అని కితాబిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలతో పాటు అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందన్నారు.
వైసీపీకి కార్యకర్తలే బలం అని, సీఎం జగన్ స్పీచ్ ద్వారా కార్యకర్తలకు భరోసా కలిగిందని ఆర్ కృష్ణయ్య అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ 175 స్ధానాలు కైవసం చేసుకోవడం ఖాయమని, మా టార్గెట్ కూడా అదే అని ఆర్ కృష్ణయ్య చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు