మళ్లీ ఎన్నికలు వస్తే 170 స్థానాలు వైసీపీవే

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి పెద్దిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారాయన. రాజీనామాలతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా అని ప్రతిపక్షాలను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగమేంటి అని అడిగారు.

మళ్లీ ఎన్నికలు వస్తే 170 స్థానాలు వైసీపీవే

ysrcp win 170 seats: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి పెద్దిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారాయన. రాజీనామాలతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా అని ప్రతిపక్షాలను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగమేంటి అని అడిగారు.

స్టీల్ ప్లాంట్ అంశంపై అంతా కలిసి కేంద్రంపై పోరాడి సాధించాలని సూచించారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితం అన్నారు పెద్దిరెడ్డి. పంచాయతీ ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు ఉక్రోషంతో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. టీడీపీ సహా అన్ని పార్టీలు, ట్రేడ్ యూనియన్లను సీఎం జగన్ ఢిల్లీ తీసుకెళ్లామన్నారని మంత్రి చెప్పారు. చంద్రబాబు హయాంలో ఏ సమస్యపైనైనా అఖిలపక్షం పెట్టారా అని పెద్దిరెడ్డి నిలదీశారు.

కాగా, రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు వస్తే వైసీపీ 170 స్థానాలను గెలుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే వస్తాయని, 90శాతం స్థానాలు వైసీపీవే అని ధీమా వ్యక్తం చేశారు.