Minister Roja : 175 మావే, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాం-మంత్రి రోజా

వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తామని, 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 లో ఇచ్చిన అన్ని హామీలను జగన్ నేరవేర్చారని అని మంత్రి చెప్పారు.(Minister Roja)

Minister Roja : 175 మావే, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాం-మంత్రి రోజా

Minister Roja : వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తామని, 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 లో ఇచ్చిన అన్ని హామీలను జగన్ నేరవేర్చారని అని మంత్రి చెప్పారు. దీంతో ప్రజలు మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని అన్నారు. జగన్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని రోజా ధీమా వ్యక్తం చేశారు.

Also Read..Pawan Kalyan : వైసీపీని దింపుతా, ముఖ్యమంత్రిని అవుతా-పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

”సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాలను జగన్ ప్రభుత్వం ఆదుకుంటోంది. జగన్ పాలనతో రాష్ట్రం బాగుపడిందని, అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని జనం నమ్ముతున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. కరోనా తగ్గుముఖం పట్టాక రాష్ట్రంలో టూరిజం పుంజుకుంది. టెంపుల్ టూరిజంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. టూరిస్టు ప్రాంతాల్లో వసతుల కల్పన కోసం ప్రైవేట్ భాగస్వామ్యంతో పని చేస్తున్నాం. స్వదేశీ దర్శన్, ప్రసాద పథకాలలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు నాలుగు ప్రాజెక్టులు మంజూరయ్యాయి” అని మంత్రి రోజా చెప్పారు.

Also Read..CM Jagan Warning : ఆ 32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్.. వారిలో మంత్రులు కూడా

అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీపై ఫైర్ అయ్యారు మంత్రి రోజా. అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలను.. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను రద్దు చేస్తామని గతంలో టీడీపీ ప్రకటించిందని మంత్రి రోజా గుర్తుచేశారు. ఇప్పుడు మాట మార్చి సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నేతలు ఇలా రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు మంత్రి రోజా.(Minister Roja)

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఆదివారం అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లంబసింగి గ్రామంలో టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిర్మించిన కాటేజీలను మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం నర్సీపట్నం రాయల్ రిసార్ట్స్ లో కాసేపు సేదతీరారు. అనంతరం ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ, అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్షాలు ఎన్నికలకు అప్పుడే రెడీ అయిపోయాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని టార్గెట్ చేశాయి. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అంధకారం నెలకొంటుందని టీడీపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ వైసీపీని రానివ్వనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.