Tirumala Ghat Road : నెలాఖరులోగా ఘాట్ రోడ్ మరమ్మతులు పూర్తి చేయాలి

నెలాఖరులోగా అప్ ఘాట్ రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేయాలని చెప్పారు. శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా వాహనాలు పంపేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

Tirumala Ghat Road : నెలాఖరులోగా ఘాట్ రోడ్ మరమ్మతులు పూర్తి చేయాలి

Tirumala Ghat Road

Tirumala Ghat Road : ఐఐటీ నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. నెలాఖరులోగా అప్ ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పారు. శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా వాహనాలు పంపేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

భారీ వర్షాల కారణంగా అప్ ఘాట్ రోడ్డులో రోడ్డు, రక్షణ గోడలు ధ్వంసం అయ్యాయి. వీటి పునః నిర్మాణం నెలాఖరులోగా పూర్తి చేయాలని వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Tanzanian Siblings : బాలీవుడ్‌ హిట్‌ సాంగ్స్‌ను లిప్ సింక్‌తో ఊపేశారు.. ఎవరీ టాంజానియా అన్నాచెల్లెళ్లు..!

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఐఐటీ నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్ ఘాట్ రోడ్డులో ఇటీవల విరిగిపడిన భారీ కొండ చరియలోని మిగిలిన సగ భాగం రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన కొండ చరియలను కెమికల్ టెక్నాలజీని ఉపయోగించి ఇబ్బంది లేని విధంగా తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల భద్రత ముఖ్యమని, ఈ విషయంలో ఖర్చుకు ఆలోచించాల్సిన అవసరం లేదని అధికారులకు సూచించారు.

భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా శాశ్వత చర్యలపైన దృష్టి పెట్టాలన్నారు. డౌన్ ఘాట్ రోడ్డు నుంచే వాహనాల రాక పోకలు సాగుతున్నందు వల్ల అలిపిరి, లింక్ బస్టాండ్, తిరుమలలో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందన్నారు. వీరి ఇబ్బందులు తొలగించడానికి లింక్ రోడ్డు మీదుగా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.