త్వరలోనే కన్నడ, హిందీ భాషల్లో svbc channel

  • Published By: madhu ,Published On : September 28, 2020 / 01:53 PM IST
త్వరలోనే కన్నడ, హిందీ భాషల్లో svbc channel

svbc buildings : తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి అనేకమంది భక్తులు ప్రతీ రోజూ వస్తుంటారన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే..తిరుమలలో శ్రీవారికి జరిగే వివిధ ముఖ్యమైన పూజా కార్యక్రమాలను, వివిధ దేవాలయాలలో జరిగే ముఖ్యమైన ఉత్సవ కార్యక్రమాలను SVBC ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.



ఎంతో మంది భక్తుల మన్ననలు పొందింది. అయితే..కన్నడ, హిందీ భాషల్లో కూడా ఛానళ్లు ప్రసారం చేయాలని భక్తుల కోరుతున్నారు. దీనిపై టిటిడి ఛైర్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల కోరిక మేరకు ఆ రెండు భాషల్లో త్వరలోనే ఛానళ్లు వస్తాయని, పూర్తి హెచ్‌డి ఛానల్ గా మార్చుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.



2020, సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం SVBC నూతన భవనాలకు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..నూత‌న భవనాల్లో రెండు స్టూడియోలు, టేలి పోర్టులు ఉన్నాయన్నారు.



ఎస్వీబీసీని యాడ్ ఫ్రీ చానల్ గా ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం భక్తుల నుంచి విరాళాలు కోరామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికే 4 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2007 లో ఎస్వీబీసీకి రూపకల్పన చేశారని గుర్తు చేశారాయన.



ఆయ‌న అనుమ‌తితోనే ఏర్పాట్లు జ‌రిగాయ‌ని, 2008 ఏప్రిల్ 7 న టెస్ట్ సిగ్నల్ నిర్వహించగా, అదే ఏడాది జులైలో పూర్తి ప్రసారాలు ప్రారంభం అయ్యాయన్నారు. 2017లో తమిళ చానల్ కూడా ప్రారంభం అయిన‌ట్లు వెల్ల‌డించారు.