AndhraPradesh education department has renamed the apjabdulkalamPratibhaPuraskarAward as ysrvidyaPuraskar

పేరు మారింది: ఇకపై అబ్దుల్ కలాం అవార్డులు కాదు.. వైఎస్ఆర్ పురస్కారాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అందించే ప్రతిభ అవార్డు ఇది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు మీద ఇచ్చే ఈ అవార్డుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టారు. ప్రతి ఏటా అబ్దుల్ కలాం పుట్టినరోజు నాడు ప్రతిభ అవార్డులు కింద విద్యార్థులకు ఇచ్చే ఈ అవార్డు పేరును.. (Dr. A. P. J Abdul Kalam Pratibha Puraskar)ను.. (YSR Vidya Puraskar)గా మార్చివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ఉంది.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడం అంటే కలాంను అవమానించడమే అనే విమర్శలు వస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజలు స్ఫూర్తిగా తీసుకుని అభిమానించే అబ్దుల్ కలాం పేరును తొలగించడం దారుణం అని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్ గొప్ప వ్యక్తి కావొచ్చని, కానీ విద్యావ్యవస్థలో రాజకీయాలకి అతీతంగా యువతకి కలాం స్ఫూర్తిదాయకమని మర్చిపోకూడదని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.  వైఎస్ఆర్‌ను గౌరవించుకోవాలనుకుంటే వారి పేరుపైన కొత్తగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు అని ఇలా అబ్దుల్ కలాం పేరు తీసెయ్యడం కరెక్ట్ కాదని అంటున్నారు. 

Related Posts