రస్సెల్ బ్యాటింగ్ ఫామ్‌లో లేడంటూ భార్యకు మెసేజ్ చేసిన ఫ్యాన్.. ఆమె సమాధానం ఏమిటంటే?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొల్‌కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే ఆండ్రూ రస్సెల్.. మంచి ఫామ్‌లో సీపీఎల్‌లో మెరుపులు మెరిపించి ఐపీఎల్‌లో ఆడుతున్న రస్సెల్.. ఈ మ్యాచ్‌ల్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోవట్లేదు. డేంజరస్ ప్లేయర్‌గా పేరు ఉన్న ఆండ్రూ రస్సెల్.. నాలుగు మ్యాచ్‌లలో వరుసగా..11, 24, 13 మరియు 2 మాత్రమే చేశాడు. Andre Russell ప్రతి మ్యాచ్‌లోనూ తన బ్యాటింగ్ సత్తా చాటుకోవడంలో తడబడుతూ ఉన్నాడు.ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆండ్రీ రస్సెల్.. 50 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అతని అత్యధిక స్కోరు 24. బ్యాటింగ్ సగటు 12.50 మాత్రమే. బౌలింగ్‌లో రాణించినా కూడా.. రస్సెల్ బ్యాటింగ్ ఇష్టపడే అభిమానులు.. అతని బ్యాట్ నుంచి పెద్ద పెద్ద షాట్లు ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే.. ఒక ఫ్యాన్ రస్సెల్ సరిగ్గా ఆడకపోవడంపై తన భార్య Jassym Loraకు కంప్లైంట్ చేశాడు. జెస్సిమ్ లోరా Instagram postలో ఆంటీ అంటూ సంబోదిస్తూ.. అభిమాని కాస్త కోపం తెప్పించేలా కామెంట్ పెట్టాడు.“ఆంటీ.. ప్లీజ్. మీరు వెంటనే దుబాయ్ వెళ్లండి. ఆండ్రీ రస్సెల్ ఫామ్‌లో లేడు..” అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి ఆమె రిప్లయ్ ఇచ్చారు. తన భర్త ఫామ్‌లోకి వస్తాడనే ధీమాను ఆమె వ్యక్తం చేశారు. ఇంకా చాలా మ్యాచ్‌లను ఆడాల్సి ఉందనీ, మున్ముందు.. రస్సెల్ విజృంభణ చూస్తారంటూ ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తన భర్త ఫామ్‌ను అందిపుచ్చుకునే పనిలో ఉన్నాడని, తాను దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఉండబోదని ఆమె రిప్లై ఇచ్చారు. (“I’m still confident (about finding form with the bat) and these things happen in cricket and I’m still working to find my way,”)

Related Tags :

Related Posts :