లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

తలకిందులుగా తపస్సు చేసినా టీడీపీ రాదు : అసెంబ్లీలో చంద్రబాబుపై అనీల్ సెటైర్లు!

Published

on

2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. పోలవరం విషయంలో వెనక్కు తగ్గి వెళ్లేది లేదని ఆయన అన్నారు. తాము ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని చెప్పిన వెంటనే పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామంటూ టీడీపీ ప్రచారం చేస్తుందని మంత్రి అనీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం అంచనా వ్యయం వ్యవహారంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, ఇప్పటికే ప్రధాని మోడీకి సీఎం జగన్ ఇదే విషయమై లేఖ రాసినట్లుగా చెప్పుకొచ్చారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముంపు బాధితుల వైపు చూడలేదని అన్నారు అనీల్ యాదవ్. సోమవారం పోలవారం అంటూ డ్రామాలు ఆడడానికే చంద్రబాబుకు సరిపోయిందని విమర్శించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తాము ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అంగుళం ఎత్తు కూడా తగ్గించకుండా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు అనీల్. చంద్రబాబు 70 శాతం పోలవరం పూర్తయిందని చెప్పడం పచ్చి అబద్ధమని మంత్రి అనిల్ తెలిపారు.పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, పోలవరం ఎత్తు ఒక మిల్లీ మీటర్‌ కూడా తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవానికి టీడీపీ వాళ్లను ఆహానిస్తాం అని అనీల్ కుమార్ అన్నారు. చంద్రబాబు చెయ్యెత్తి భయపెడితే భయపడిపోతాం అనుకోవద్దు.. భయపడేవారు ఎవరూ లేరు.. విచక్షణ కోల్పోయి చంద్రబాబు ఓపిక లేకుండా 70ఏళ్ల వయసులో ఆవేశపడుతుంటే యువకులం మేం ఎలా మాట్లాడాలి అని ప్రశ్నించారు. తలకిందులుగా తపస్సు చేసినా తెలుగు దేశం ఇక రాదు అంటూ అనీల్ అన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *