పిల్లలు కాదు పిడుగులు.. ఇంటర్వెల్ ఫైట్‌తో డైరెక్టర్‌కే షాక్ ఇచ్చారు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రేక్షకులకు ఒకప్పుడు సినిమా అన్నా, సినిమా వాళ్లు అన్నా.. చాలా ప్రత్యేక గౌరవం ఉండేది. బ్లాక్ అండ్ వైట్ కాలంలో అయితే సినిమా వాళ్లని దేవుళ్లని చూసినట్లు చూసేవారు. అంత గౌరవం ఇచ్చేవారు. ఇప్పటికీ అక్కడక్కడా సినిమా వాళ్లు అంటే.. ‘వాళ్లు చాలా స్పెషల్’ అనే భావన ఉంది కానీ.. రాను రాను ఈ స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా పుణ్యమా అని.. ప్రతి ఒక్కరూ హీరోలుగానే ఫీలైపోతున్నారు. ఆ కోవలోనే టిక్‌టాక్ అనేది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కొందరు చేసిన వీడియో చూసి దర్శకుడు అనిల్ రావిపూడి షాక్ అయ్యారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఎటువంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంటర్వెల్‌ ఫైట్ మహేష్‌కు, ఆయన అభిమానులకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ‘ఒక్కడు’ తర్వాత కొండారెడ్డి బురుజు దగ్గర ఆ ఫైట్ జరడం..అయితే ఇప్పుడు సేమ్ టు సేమ్ ఆ ఫైట్‌నే చిన్న పిల్లలు సినిమా లెవల్‌లో చేసి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా నెట్‌లో వదిలారు. నిజంగా చిన్న పిల్లలు చేసిన ఆ ఫైట్ చూస్తే.. ఎవరైనా సరే.. వావ్ అనాల్సిందే. అంతెందుకు ‘సరిలేరు నీకెవ్వరు’ డైరెక్టర్ అనిల్ రావిపూడే ‘అద్భుతం’ అంటూ ట్వీట్ చేశారంటే.. ఆ ఫైట్‌ని పిల్లలు ఏ రేంజ్‌లో చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.‘‘నిజంగా ఆ పిల్లల అంకితభావం చూసి షాకయ్యాను.. సంతోషంతో ఆశ్చర్యపోయాను. అసాధారణమైన ప్రతిభ వీళ్లది. నిజంగా వీళ్లు పిల్లలు కాదు పిడుగులు. (నోట్: ఇలాంటివి ఎటువంటి జాగ్రత్తలు లేకుండా చేయడం ప్రమాదం జాగ్రత్త పిల్లలూ..)’’ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఈ వీడియోకు మహేష్ ఫ్యాన్స్, నెటిజన్ల కామెంట్స్ అయితే మాములుగా లేవు. అందరూ ఆ పిల్లలని ప్రశంసలతో ముంచేస్తున్నారు..

Related Posts