లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అంజన్ కుమార్ రాజీనామా

Published

on

Anjan Kumar resigns Hyderabad City Congress president : తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. కాంగ్రెస్ హైదరాబాద్ సిటీ అధ్యక్ష పదవికి అంజన్‌కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. దీనిని ఆయన అధికారికంగా ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని, అయితే తాను గ్రేటర్‌ అధ్యక్షుని కాదన్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు మాత్రమే తాను అధ్యక్షుడిని అని తెలిపారు. సీట్ల కేటాయింపులో తన ప్రమేయం లేదన్నారు.ప్రతీ నియోజకవర్గానికి పెద్ద లీడర్లు ఉన్నారని తెలిపారు. గ్రేటర్‌లో ఓటమి అపనింద పడటం ఇష్టం లేకనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాను ఏ పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్లనని తేల్చి చెప్పారు. తన రాజకీయ జీవితం ఉన్నంత కాలం కాంగ్రెస్‌లోనే ఉంటానని అంజన్‌కుమార్‌ తెలిపారు.మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ర‌థసార‌థి ఎంపిక‌పై క‌స‌ర‌త్తు ప్రారంభ‌మైంది. పీసీసీ చీఫ్‌ పదవికి ఉత్తమ్ రాజీనామా చేయ‌డంతో.. కొత్తవారి ఎంపిక అనివార్యమైంది.

దీంతో.. పార్టీ రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్‌ను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపింది. తెలంగాణ పీపీసీ ఎంపికపై కసరత్తు చేస్తోంది.పీసీసీ ఎంపిక‌ను గతంలో పార్టీ అధిష్టానం నేరుగా నియ‌మించేది. కానీ ఈసారి కాస్త భిన్నమైన ప్రక్రియ‌ను చేప‌ట్టింది. పార్టీ ప‌ద‌విని ఆశిస్తున్న వారు అధికంగా ఉండ‌టంతో.. విస్తృత అభిప్రాయ సేక‌ర‌ణ త‌ర్వాతే అధ్యక్షుడిని ప్రక‌టించాల‌ని డిసైడ్ అయ్యింది. దీనికోసం కోసం ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మానిక్కమ్‌ ఠాగూర్‌ హైదరాబాద్‌ వచ్చారు.మూడు రోజుల అభిప్రాయ సేకరణలో భాగంగా.. మొదటి రోజు కోర్‌ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు ఉత్తమ్‌ టీపీసీసీ చీఫ్‌గా ఉంటారని తేల్చిచెప్పారు. ఇక స‌భ్యులంద‌రికీ ఠాగూర్ స్పష్టమైన సందేశం ఇచ్చిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.స‌మావేశంలో జ‌రిగిన వివ‌రాలు లేదా.. ఒక్కొక్కరిగా వెలువ‌రించిన అంశాల‌ను మీడియాతో షేర్ చేసుకోకూడ‌ద‌ని కండీష‌న్ పెట్టార‌ట‌. అలాగే.. పార్టీలో ప‌ద‌వి కోసం గ్రూపులుగా విడిపోయి.. సోష‌ల్ మీడియాలో ఒకరిపై మ‌రొక‌రు కామెంట్లు చేసుకోవ‌డం కూడా స‌రైంది కాద‌ని హెచ్చరించినట్లు తెలుస్తోంది.