సుషాంత్‌తో ఏడేళ్లు గడిపా.. అతను డిప్రెషన్ కు వెళ్లలేదు.. నాకు నిజం తెలియాలి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రియా చక్రవర్తి-సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ల రిలేషన్ షిప్ గురించి నోరు మెదపని అంకితా లోఖండె తనకు నిజం తెలియాలని అంటోంది. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సుషాంత్ ఫ్యామిలీకి తాను ఫుల్ సపోర్టింగ్ గా ఉంటానని చెప్పింది. సుషాంత్ జూన్ 14న ముంబైలోని ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు.

‘సుషాంత్-రియా చక్రవర్తి రిలేషన్ షిప్ పై నేను మాట్లాడలేను. ఎందుకంటే నేను అక్కడ లేను. సుషాంత్ కుటుంబం కోసం సపోర్టింగ్ గా నిలబడతాను. ప్రజలకు చూపించడానికి కాస్త ప్రూవ్ చేయాలి. మానవత్వం గురించి వీరు ఏ స్థాయిలో ఉన్నారో నాకు తెలుసు. నాలుగేళ్ల నుంచి వీళ్లతో ఉంటున్నా. చాలా సమయం వారితో కలిసి ఉన్నా. సుషాంత్ కుటుంబం కోసం నిలబడతాను. నాకు నిజం తెలియాలి’

‘సుషాంత్ డిప్రెషన్ కు గురికాలేదు. ఎవరైనా అది ఆత్మహత్య అని అంటే అదెందుకో కూడా చెప్పాలి. ఎవరైనా ఇది హత్య అంటే దానిని ఎవరు చేశారో చెప్పాలి. నేను సుషాంత్ కుటుంబం కోసం నిలబడతాను. అసలు జరిగిందో నాకు తెలియాలి. డిప్రెషన్ కు వెళ్లలేదని కచ్చితంగా చెప్పగలను. అది నమ్మడం నాకు అసాధ్యమే’అని అంకితా చెప్పింది

అంకితా లోఖండే-సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఇద్దరు పాపులర్ టీవీ షో.. పవిత్ర రిష్తాలో కో స్టార్స్ గా నటించారు. ఆ సమయంలోనే ఏడేళ్ల పాటు డేటింగ్ ఉన్న వీళ్లు 2016లో విడిపోయారు.

Related Posts