లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

వైసీపీ రాజ్యసభ సభ్యులు వీరే…

వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రకటించారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని ఖరారు చేశారు.

Published

on

announced of four YCP Rajya Sabha members names

వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రకటించారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని ఖరారు చేశారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రకటించారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని ఖరారు చేశారు. పార్టీ శ్రేయోభిలాషి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు ఖరారు చేశామని ఉమ్మారెడ్డి తెలిపారు. బీసీ కోటాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంబానీ అడిగిన విధంగా నత్వానికి స్థానం కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. అందరితో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 

నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపికను సీఎం జగన్ ఖరారు చేశారు. రాజ్యసభ బరిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఉన్నారు. వచ్చే నెలతో సుబ్బిరామిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం ముగుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కు సుబ్బిరామిరెడ్డి వెళ్లారు. ఈ సారి తనకు వైసీపీ నుంచి అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. 

వైసీపీకి వచ్చే నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎవరికి కేటాయిస్తారనే అంశంపై ఆ పార్టీలో క్లారిటీ వచ్చింది. నలుగురు పేర్లను సీఎం జగన్ ఖరారు చేశారు. వీరిలో ఎమ్మెల్సీలుగా ఉండి ప్రస్తుతం ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వారిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్లు రాజ్యసభకు ఖరారు అయ్యాయి. మరొక స్థానాన్ని ఆ పార్టీ సీనియర్ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

నాలుగో స్థానానికి సంబంధించి ముఖేష్ అంబానీకి సంబంధించిన వ్యక్తి పరిమల నత్వాని రాజ్యసభ సభ్యత్వం పూర్తి అయింది. కొద్ది రోజుల క్రితం పరిమల నత్వాని… సీఎం జగన్ ను కలిసి రాజ్యసభ సీటు కేటాయించాలని కోరారు. పారిశ్రామిక వేత్తల కోటలో పరిమల నత్వానికి కూడా రాజ్యసభ సీటు కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇద్దరు బీసీలు, ఒక రెడ్డీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఒక పారిశ్రామిక వేత్తకు సంబంధించి నలుగురికీ ఫైనల్ చేశారు. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి అధికారిక ప్రకటన చేశారు. సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ వర్గానికి పెద్ద పీట వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరో కీలక అంశం మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తూ కేంద్రానికి పంపిన నేపథ్యంలో మండలి రద్దైనట్లైతే ఇద్దరి మంత్రి పదువులు కూడా పోతాయి కాబట్టి సామాజిక వర్గానికి చెందిన ఆ ఇద్దరు మంత్రులకు న్యాయం చేసే విధంగా జగన్.. రాజ్యసభ సీట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.