లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

ప్రియుడితో వెళ్లిపోయిన భార్య…… ఏడుస్తున్న కూతుర్ని చంపేసిన భర్త

Published

on

father strangles 4-yr-old daughter to death : తాళి కట్టిన మొగుడు వద్దు…. అక్రమ సంబంధాలే ముద్దు అన్న చందంగా మారింది కొందరు మహిళల పరిస్ధితి. తాళి కట్టిన భర్తను, నాలుగేళ్ల చిన్నారిని వదిలేసి, ప్రియుడితో వెళ్లిపోయింది ఓ ఇల్లాలు. భర్త దగ్గర వదిలేసిన నాలుగేళ్ల కూతురు ఆపకుండా ఏడుస్తూ… విసిగిస్తూ ఉండటంతో ఆ చిన్నారిని హత్య చేశాడు తండ్రి. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ నోయిడా సెక్టార్ లో ఈ దారుణం జరిగింది.

తండ్రిని చంపేసిన బాలుడు.. క్రైం సీరియల్స్ 100సార్లు చూసి సేఫ్ అవ్వాలని


సుల్తాన్ పూర్ కుచెందిన వాసుదేవ గుప్తా(28) వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. అతని భార్య నోయిడాలోని సెక్టార్ 63లోని “స్పా” లో పని చేస్తోంది. 4 ఏళ్ల కుమార్తె, 3 ఏళ్ళ కుమార్తెతో కలిసి ఈ దంపతులు ఖోడా కాలనీలో అద్దె ఇంట్లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. సుమారు 20 రోజుల క్రితం గుప్తా భార్య, భర్తతో గొడవ పడి మూడేళ్ల కొడుకుని తీసుకుని తన ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. నాలుగేళ్ల కుమార్తెను గుప్తావద్ద వదిలేసింది.భార్య తనను విడిచి పెట్టి వెళ్లిపోవటంతో గుప్తా మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం, అక్టోబర్29న గుప్తా కుమార్తె ఏడవటం ప్రారంభించింది. ఆమెను ఎంత సముదాయించాలని చూసినా గుప్తా వల్ల కాలేదు. బాలిక ఏడుపు ఆపలేదు. విసుగుచెంది…అసహనంతో ఉన్న గుప్తా కుమార్తెను గొంతు కోసి చంపేశాడు. నాలుగేళ్ల బిడ్డను టవల్లో చుట్టి భార్య కోసం వెతుక్కుంటూ ఆటోలో బయలు దేరాడు.

సాయంత్రం 5 గంటల సమయంలో గుప్తా సోదరుడు రవి ఇంటికి వచ్చాడు. అన్న ఇంటి తలుపులు తీసి ఉండటం గమనించి…గుప్తాకు ఫోన్ చేశాడు. తన బిడ్డను చంపేశానని, శవం భార్యకు అప్ప చెప్పటానికి వెతుకుతున్నానని గుప్తా సోదరుడికి చెప్పాడు. వెంటనే రవి ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశాడు. అలర్టైన పోలీసులు గుప్తా కోసం వెతకటం ప్రారంభించారు. కానీ గుప్త ఎక్కడ ఉన్నాననే విషయం తెలియలేదు.మొదట ఖోడా కాలనీలోనే ఉన్నట్లుగా చెప్పటంతో పోలీసులు ఆ ఏరియాలో వెతకటం ప్రారంభించారు. కానీ గుప్తా దొరకలేదు. ఈవిషయం గుప్తా స్నేహితులకు కూడా తెలియటంతో వారు కూడా గుప్తా కొసం వెతక సాగారు. అయినా గుప్తా జాడ తెలియలేదు. కొంత మంది గుప్తా భార్య పని చేస్తున్న నోయిడా సెక్టార్ 63 వద్దకు చేరుకున్నారు. ఈలోగా పోలీసులు ఘజియాబాద్ పోలీసులను అప్రమత్తం చేసారు. వారు నోయిడాలో గుప్త భార్య పనిచేసే స్పా వద్ద కాపు కాశారు.భార్య కోసం పలు ప్రాంతాల్లో వెతికిన గుప్తా చివరకు ఆమె పని చేసే, నోయిడా సెక్టార్ 63లోని స్పా వద్దకు చేరుకున్నాడు. స్పా వెలుపల కుమార్తె మృత దేహాన్ని  పడేసి వెళ్లే ప్రయత్నంలో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గుప్తా పై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసారు. కుమార్తె మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. గుప్తా భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *