another-case-of-kidnap-murder-in-up-body-of-14-year-old-boy-found-near-canal-in-gorakhpur

బాలుడి కిడ్నాప్.. కోటి రూపాయలు డిమాండ్..హత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర్రం  పేరు ఇటీవల తరచూ కిడ్నాప్ వార్తలతో ప్రముఖంగా వినపడుతోంది. ఇంతకు ముందు రెండు ఘటనలు జరగ్గా, ఆదివారం మూడోఘటన జరిగింది. గోరఖ్ పూర్ జిల్లాలోని పిప్రాయిచ్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు కోటి రూపాయలు డిమాండ్ చేశారు. బాలుడి తండ్రి డబ్బు చెల్లించకపోయేసరికి ఆ బాలుడిని హతమార్చారు.

పిప్రాయిచ్ ప్రాంతంలో పాన్ షాపు యజమాని మహజన్ గుప్తా కుమారుడు (14) 6వ తరగతి చదువుతున్నాడు. జులై26, ఆదివారం మధ్యాహ్నం భోజనం చేశాక ఆడుకోటానికి బయటకు వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం తనకు తెలియని నెంబరు నుంచి తండ్రికి ఫోన్ వచ్చింది. మీ పిల్లాడిని కిడ్నాప్ చేసాము. కోటి రూపాయలు ఇస్తే విడుదల చేస్తామని ఆవతలి వ్యక్తి డిమాండ్ చేశాడు. కిడ్నాపర్ల డిమాండ్ తో భయపడి పోయిన బాలుడి తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

ఏఎస్పీ సునీల్ కుమార్ గుప్తా ఒక టీం ని ఏర్పాటు చేసి బాలుడి ఆచూకి కోసం గాలింపు చేపట్టారు. రాత్రి అయినా బాలుడి ఆచూకి లభ్యం కాలేదు. బాలుడి తండ్రికి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం ధూసర్ అటవీ ప్రాంతానికి చెందిన దయానంద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో తన సహచరులతో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసి సాయంత్రం హత్య చేశామని దయానంద్ ఒప్పుకున్నాడు.

బాలుడిని చంపిన తర్వాత దుండగులు శవాన్ని ఒక సంచిలో కుక్కి కెవాటియా ప్రాంతంలోని కాలువలో విసిరేసిట్లు చెప్పాడు. పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దయానంద్ కు సహకరించిన ధూసర్ ప్రాంతానికి చెందిన అజయ్ గుప్తా,నితిన్ చౌహాన్ మరియు అజయ్ చౌహాన్, మరియు మిష్రౌలియా గ్రామానికి చెందిన నిఖిల్ భారతిలను అరెస్టు చేశారు. వీరు ఫోన్ చేయటానికి సిమ్ కార్డు విక్రయించిన రింకు గుప్తా మరియు నితేష్ పాస్వాన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

గత 10 రోజులుగా బాలుడిని కిడ్నాప్ చేయటానికి నిందితులు ప్రయత్నం చేశారని పోలీసు అధికారులు తెలిపారు. బాలుడి తండ్రి ఇటీవల ఆ ప్రాంతంలో కొంత భూమిని కొన్నాడు. ఆ భూమికి అమ్మకానికి సంబంధించిన లావాదేవిల వ్యవహారంలో దయానంద్ కూడా ఉన్నాడు. కనుక అతడి వద్దనుంచి డబ్బు కాజేసే ఉద్దేశ్యంతోనే బాలుడ్ని కిడ్నాప్ చేశారని…తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో హత్య చేశారని పోలీసులు వెల్లడించారు.

Related Posts