another-chinese-virus-icmr-warns-india-of-cat-que-virus-which-could-spread-disease-in-the-country

మరో చైనా డేంజరస్ వైరస్.. భారత్‌కు ముప్పు ఉందని ICMR హెచ్చరిక

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Chinese Cat Que Virus : చైనా నుంచి వ్యాపించిన కరోనావైరస్ మహమ్మారి పీడ ఇంకా వీడనే లేదు. ఇప్పుడు మరో చైనీస్ వైరస్ ముప్పు ముంచుకోస్తోంది. ప్రత్యేకించి భారతదేశానికి చైనా నుంచి ముప్పు ఉందనే ఆందోళన పుట్టిస్తోంది. కరోనా మహమ్మారి కంటే డేంజరస్ వైరస్ ఒకటి వ్యాపి చెందే అవకాశం ఉందని ICMR ( Indian Council of Medical Research) ఇండియాను హెచ్చరిస్తోంది.

‘Cat Que Virus’ అనే చైనీస్ వైరస్ నుంచి ముప్పు పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది. దేశంలో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఐసీఎంఆర్ ముందస్తు హెచ్చరిక చేసింది. క్యూలెక్స్ జాతికి చెందిన దోమలు, పందులను ఈ వైరస్ వాహకాలుగా మార్చుకుంటుందని అంటోంది.



చైనా, తైవాన్ సైంటిస్టుల అధ్యయనంలో ఈ Cat Que Virus వైరస్ ప్రాణాంతకమని రుజువైంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ICMR హెచ్చరిస్తోంది. భారత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

ఇండియాలో Cat Que Virus వచ్చిందా? :
ఈ ‘క్యాట్ క్యూ వైరస్’ ఇండియాలో వ్యాపించిందా? ఇప్పటివరకూ దేశంలో ఎవరికైనా వ్యాపించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్ దేశంలోకి ప్రవేశించిందా లేదా అనే కోణంలో పూణె ఆధారిత National Institute of Virology (NIV) పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు.



ICMR అధ్యయనం ప్రకారం.. Arthropod-borne viruses (arboviruses) వైరస్ (CQV) మానవాళిలో జ్వరం, మెనింజైటిస్, చిన్న పిల్లలో మెదడు వాపు లాంటి వ్యాధులకు దారితీస్తుంది. దోమలు CQV వైరస్‌కు గురయ్యే అవకాశం ఉంది. దోమల ద్వారా మనుషులకు సోకే అవకాశం ఉందని అంటున్నారు. ICMR సహా NIV సైంటిస్టులు ఇండియాలో సుమారు 883 హ్యూమన్ సీరం శాంపిల్స్ పరీక్షించారు. వీరిలో CQV యాంటీ బాడీస్ ఉన్నాయని నిర్ధారించారు. కానీ వైరస్ లక్షణాలు ఏమి లేమని గుర్తించారు.



దేశంలో ఇప్పటికే చాలామంది ఈ వైరస్ బారినపడే ఉంటారని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ వైరస్ ఎంతమందిలో వ్యాపించి ఉంటుందో నిర్ధారించేందుకు మరికొంతమంది శాంపిల్స్ కూడా పరీక్షించాలని ICMR సైంటిస్టులు చెబుతున్నారు. 2014 నుంచి 2017లో కర్ణాటకకు చెందిన ఇద్దరి వ్యక్తుల శాంపిల్స్‌లో Cat Que Virus పాజిటివ్ ఫలితాలు వచ్చాయి.



దీనికి సంబంధించి ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (IJMR) లేటెస్ట్ ఇష్యూలో అధ్యయన ఫలితాలు వెల్లడయ్యాయి. సాధారణంగా దోమలకే ఈ CQV వైరస్ కు వాహకాలు.. దేశీయ పందులు కూడా CQV వైరస్ వాహకాలుగా గుర్తించారు. చైనాలో స్థానికంగా నమోదైన స్వైన్ వ్యాప్తి కేసుల్లో యాంటీ CQV IgM, IgG యాంటీబాడీలు ఉన్నాయని సైంటిస్టులు నిర్ధారించారు.

Related Posts