లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

బోయిన్ పల్లి కిడ్నాప్ : తెరపైకి కొత్త పేర్లు, ఎవరీ సిద్దార్థ్ ?

Published

on

Bowenpally kidnap : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయ్‌. కిడ్నాప్‌లో విజయవాడకు చెందిన సిద్దార్థ్‌ది కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు పోలీసులు. కిడ్నాప్‌ కోసం మొత్తం మనుషులను భార్గవరామ్‌కు సిద్ధార్థ్ సరఫరా చేశాడు. భార్గవరామ్ ఆదేశాలతో 15మందిని విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన సిద్ధార్థ్.. వారందరితో నకిలీ ఐటీ రైడ్స్ నిర్వహించాడు. ముగ్గురిని కిడ్నాప్ చేసిన తర్వాత సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్ పరారైంది.

గోవాలో సిద్దార్థ్ గ్యాంగ్ :-
సిద్ధార్థ్‌ సహా గ్యాంగ్‌లో కొందరిని పోలీసులు గోవాలో పట్టుకున్నారు. సిద్ధార్థ్ విజయవాడ కేంద్రంగా బౌన్సర్లను సరఫరా చేస్తుంటాడు. అతడు గతంలో అఖిలప్రియ, భార్గవరామ్‌లకు పర్సనల్ గార్డ్‌గా ఉన్నట్లు తేల్చారు పోలీసులు. ఇలా.. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏకంగా 23 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఏ1 ముద్దాయిగా పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలోకి తీసుకున్న విచారించిన సమయంలో అఖిలప్రియ ఏం చెప్పారు… అసలు కిడ్నాప్ కేసులో ఎవరి క్యారెక్టర్ ఏమిటీ…? అనేవే ప్రధానంగా మారనున్నాయి.

భూమా సెల్ ఫోన్ :-
భూమా అఖిలప్రియ సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కిడ్నాపర్లతో ఆమె తరచూ మాట్లాడినట్లు పోలీసులు సిగ్నల్స్‌ ఆధారాలు సేకరించారు. ఆమె సొంత ఫోన్‌తో పాటు.. మరో సెల్‌ఫోన్‌ కూడా వాడినట్టు పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి కూకట్‌పల్లిలోని అపార్ట్‌మెంట్ వరకు ఆమె రెండు ఫోనుల్లో మాట్లాడుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది.

అఖిల ప్రియ ఇళ్లకు తాళం :-
పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో అఖిలప్రియ ఉపయోగించిన రెండు ఫోన్లు ఆమె ఇంట్లోనే ఉండిపోయాయి. వాటిని స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అఖిలప్రియ ఇళ్లకు తాళం వేసి ఉంది. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఇంటి తాళం తీసి సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

పోలీసుల బృందాల గాలింపు :-
మరోవైపు అపహరణ కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌ను నిందితులుగా చేర్చిన పోలీసులు వాళ్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అపహరణ కుట్ర గురించి వీళ్లకు ముందే తెలుసునని.. వీళ్ల సమక్షంలో కిడ్నాపర్లతో చర్చించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు పరారీలో ఉన్న భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను కోసం పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం 12మంది నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *