hemanth honour killing

ప్రణయ్‌ని చంపినట్టే.. తెలంగాణలో మరో పరువు హత్య, ప్రేమించి పెళ్లి చేసుకున్న హేమంత్ దారుణ హత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

IPL 2020: తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్‌‌కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై కక్ష పెంచుకున్న యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత్య చేయించాడు. గతంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ను అమృత తండ్రి మారుతీరావు హత్య చేయించాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది.

హైదరాబాద్‌ చందానగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్, అదే ప్రాంతానికి చెందిన అవంతి రెడ్డిని ప్రేమించాడు. ఇద్దరు పరస్ఫర అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లి అవంతి తండ్రి లక్ష్మారెడ్డికి ఏ మాత్రం నచ్చలేదు. తనను వ్యతిరేకించి పెళ్లి చేసుకోవడంతో ఆయన కోపంతో రగిలిపోయాడు. పరువు పోయిందని తెగ బాధపడ్డాడు. కిరాయి మనుషులతో హేమంత్ ని కిడ్నాప్ చేయించాడు. అనంతరం సంగారెడ్డిలో హత్య చేయించాడు.

వివాహానంతరం యువ జంట చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉంటోంది. నిన్న(సెప్టెంబర్ 24,2020) మధ్యాహ్నం ప్రేమ జంటను గచ్చిబౌలిలో కిడ్నాప్ చేయగా యువతి కారులో నుంచి పారిపోయి 100కి సమాచారం ఇచ్చింది. అయితే సకాలంలో గచ్చిబౌలి పోలీసులు స్పందించ లేదని ఆమె ఆరోపిస్తోంది. ప్రస్తుతం హేమంత్ మృతదేహం ఉస్మానియాలో ఉన్నట్టు తెలుస్తోంది.

* హైదరాబాద్ లో మరో పరువు హత్య
* ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి హత్య
* తన కూతురిని పెళ్లి చేసుకున్నాడని యువకుడిని చంపించిన తండ్రి
* పక్కా ప్లాన్ ప్రకారం కిరాయి గూండాలతో గచ్చిబౌలిలో హేమంత్ ను కిడ్నాప్ చేయించి సంగారెడ్డిలో హత్య
* కొండాపురం మండలం కిష్టాయగూడెంలో మృతదేహాన్ని పడేసిన సుపారీ గ్యాంగ్
* పెళ్లి తర్వాత గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ప్రేమజంట నివాసం
* నిన్న మధ్యాహ్నం గచ్చిబౌలిలో ప్రేమజంట కిడ్నాప్

* కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని 100కి సమాచారం ఇచ్చిన హేమంత్ భార్య అవంతిరెడ్డి
* 100కి సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని యువతి ఆరోపణ
* అవంతి తండ్రి లక్ష్మారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
* అవంతి తండ్రి లక్ష్మారెడ్డి సమాచారంతో మృతదేహం గుర్తింపు
* కిష్టాయగూడెంలో చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహం లభ్యం
* ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్



Related Posts