Another scam in Tirumala

తిరుమలలో మరో స్కామ్ : సిఫార్సులతో శ్రీవారి సేవా టికెట్లు విక్రయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తిరుమలలో మరో స్కామ్ బయటపడింది. 46 మంది ప్రజాప్రతినిధులు, మంత్రులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలపై ఓ దాళారి వందలాది టికెట్లు పొంది భక్తులకు అధిక మొత్తంలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.

తిరుమలలో మరో స్కామ్ బయటపడింది. 46 మంది ప్రజాప్రతినిధులు, మంత్రులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలపై ఓ దాళారి వందలాది టికెట్లు పొంది భక్తులకు అధిక మొత్తంలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. చారి అనే దళారి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై అక్రమంగా శ్రీవారి సేవా టికెట్లు పొందారు. వీటిని భక్తులకు అధిక మొత్తానికి విక్రయించాడని గుర్తించారు. 

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం సిఫార్సు లేఖపై 36 సార్లు, అంబర్ పేట ఎమ్మెల్యే సిఫార్సు లేఖపై 23 సార్లు, వరంగల్ ఎమ్మెల్యే కోటాలో 17 సార్లు, వరంగల్ ఎంపీ కోటాలో 11 సార్లు టికెట్లు పొందాడు దళారి చారి. తెలుగు రాష్ట్రాలకు చెందిన అత్యంత ముఖ్యులైన ప్రజాప్రతినిధులతోపాటు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, అత్యంత ఉన్నతాధికారుల లేఖలతో చారి పెద్ద ఎత్తున టికెట్లు పొందారు. 

ఏడాది కాలంగా 50 మంది ప్రముఖుల సిఫార్సు లేఖలతో వందలాది శ్రీవారి సేవా టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు పొందినట్లు తెలుస్తోంది. వీటిని అధికమొత్తంలో భక్తులకు అమ్మినట్లుగా టీటీడీ గుర్తించింది. ప్రధానంగా చారిపై టీటీడీ చాలా కాలంగా నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. అత్యంత ప్రముఖల సిఫార్సుల లేఖలతో శ్రీవారి టికెట్లు పొందుతున్నట్లు టీటీడీ అనుమానించింది.

అతనిపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచిన క్రమంలో బండారం మొత్తం బయటపడింది. ఏపీ, తెలంగాణకు చెందిన ప్రస్తుత హోంమంత్రుల లేఖలు కావచ్చు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప లేఖ, ప్రముఖ ఎమ్మెల్యేలతోపాటు తెలంగాణకు చెందిన ముఖ్య నేతల సిఫార్సు లేఖలు పొంది వాటి ద్వారా శ్రీవారి బ్రేక్ దర్శనం, సేవా టెకెట్లు పొంది, భక్తులకు విక్రయించాడు. 

తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల లేఖలతో శ్రీవారి సేవా టికెట్లు పొంది వాటిని విక్రయించినట్లు తెలుస్తోంది. శుక్రవారం (నవంబర్ 1, 2019) టీటీడీ చారిని అదుపులోకి తీసుకుంది. 200 నుంచి 300 సేవా టికెట్లు పొందినట్లు తెలుస్తోంది. నిజానికి వారే లేఖలు ఇచ్చారా లేదా పూర్తిస్థాయిలో వారి సిఫార్సు లేఖలను ఫోర్జరీ చేసి నకిలీ లేఖలు సృష్టించి శ్రీవారి సేవా టికెట్లు పొందారా అన్న కోణంలో టీటీడీ ముమ్మురంగా దర్యాప్తు జరుపుతోంది.
 

Related Posts