ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఎవరికి వారే గొంతు కోసుకున్నాం.. దివ్య తేజస్విని హత్య కేసులో మరో ట్విస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Divya Tejaswini murder Case: ఏపీలో సంచలనం రేపిన విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ హత్య కేసులో నిందితుడు నాగేంద్ర కోలుకుంటున్నాడు. అతడు విస్తుపోయే విషయాలు చెప్పాడు. మూడేళ్లుగా దివ్య తేజస్వినితో తనకు పరిచయం ఉందన్నాడు. ఏడాది క్రితం ఇద్దరం వివాహం చేసుకున్నట్టు చెప్పాడు. తేజస్విని ఒత్తిడితోనే పెళ్లి చేసుకున్నట్టు నాగేంద్ర తెలిపాడు.

కాగా, ఏడు నెలలుగా తేజస్వినిని తన నుంచి దూరం చేశారని వాపోయాడు. దివ్యతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లాను అన్నాడు. పెద్దలు కాపురానికి అంగీకరించడం లేదు, చనిపోదామని తనతో దివ్య చెప్పిందని నాగేంద్ర తెలిపాడు. నాకు న్యాయం కావాలి, ఎలాంటి పోరాటానికైనా సిద్ధం అని నాగేంద్ర అన్నాడు.

మొత్తంగా దివ్య తేజస్విని కేసులో విస్తుపోయే నిజాలు.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తమ బిడ్డను నాగేంద్రనే చంపాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. గంజాయి అలవాటు ఉన్న నాగేంద్రను తమ బిడ్డ ఎందుకు ప్రేమిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రేమ, పెళ్లి అంతా అబద్దమని కొట్టిపడేశారు. కాగా, నాగేంద్ర మాత్రం తమది ప్రేమ పెళ్లి అని చెబుతున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో పెళ్లి చేసుకున్న విషయం దివ్య పేరెంట్స్‌కి తెలుసన్నాడు. ఆ తర్వాత తమను విడదీశారని.. అందుకే కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం నాగేంద్ర ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఎవరి వాదన వారే చెబుతుండడంతో.. దివ్య కేసులో అసలు నిజాలేంటన్నది మిస్టరీగా మారింది.

దివ్య తల్లిదండ్రుల వెర్షన్:
దివ్యను నాగేంద్రనే చంపేశాడు
నాగేంద్రకు గంజాయి అలవాటు
దివ్యకు నాగేంద్ర సరైన వ్యక్తి కాదు
గంజాయి మత్తులో హత్య చేశాడనే అనుమానం
చెడు అలవాట్లపై మందలింపు
అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదు

నాగేంద్ర వెర్షన్:
దివ్యను హత్య చేయలేదు
సంవత్సరకాలంగా ఇద్దరం ప్రేమించుకున్నాం
లాక్‌డౌన్‌ సమయంలో పెళ్లి చేసుకున్నాం
పెళ్లి విషయం దివ్య కుటుంబానికి తెలుసు
దివ్య పేరెంట్స్ మమ్మల్ని విడదీశారు
ఎవరికి వారే గొంతు కోసుకున్నాం

* దివ్య తేజస్విని కేసులో వెలుగులోకి కొత్త విషయాలు
* మా బిడ్డను నాగేంద్రనే చంపేశాడు- దివ్య కుటుంబం
* హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడు
* ప్రేమ, పెళ్లి మాకు విషయం తెలియదు- దివ్య పేరెంట్స్

* ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం-నాగేంద్ర
* పెళ్లి విషయం తెలిసిన తర్వాత మమ్మల్ని విడదీశారు-నాగేంద్ర
* ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం..
* ఎవరికి వారే కత్తితో గొంతు కోసుకున్నాం-నాగేంద్ర
* ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న నాగేంద్ర
* పోలీసుల విచారణలో బయటకు రానున్న అసలు నిజాలు

నేరుగా బెడ్ రూమ్ లోకి దూరి కత్తితో దాడి:
క్రీస్తురాజుపురానికి చెందిన దివ్య తేజస్విని భీమవరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఈయర్ చదువుతోంది. కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాసులు వింటోంది. ఈ క్రమంలోనే నిన్న(అక్టోబర్ 15,2020) దివ్య ఇంట్లోకి ప్రవేశించిన నాగేంద్ర.. తలుపులన్నీ మూసేశాడు. నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి దివ్యపై కత్తితో దాడి చేశాడు. ఆపై నాగేంద్ర తనకు తాను గాయం చేసుకున్నాడని దివ్య కుటుంబం ఆరోపిస్తోంది. గాయపడ్డ దివ్యను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి చనిపోయింది.

ఏది నిజం? ఎవరు కరెక్ట్?
తేజస్విని ఎవరినీ ప్రేమించలేదంటోంది తల్లి కుసుమ. ప్రేమ జోలికి వెళ్లకుండా ఉమెన్స్ కాలేజీలో చదువుకుంటోందని చెబుతోంది. మరోవైపు నాగేంద్ర మాత్రం మూడేళ్లుగా ప్రేమించుకుని, ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నామని చెబుతున్నాడు. నాగేంద్ర, దివ్య పెళ్లి విషయం నిన్నే తెలిసిందన్నాడు నాగేంద్ర తమ్ముడు నాగరాజు. ఒక వారం నుంచి డల్‌గా ఉంటున్నాడన్నారు. పెళ్లి విషయం ముందే తెలిస్తే ఇంత దారుణం జరిగేది కాదన్నాడు. మరోవైపు హత్య చేయాలని ముందే నాగేంద్ర స్వామి ప్లాన్‌ చేసుకున్నాడని ఆరోపించాడు తేజస్విని తండ్రి. బయటికి వెళ్తే చంపేసిన ఘటనలు విన్నాం కానీ.. ఇంట్లో ఉన్నా కూడా చంపితే ఆడబిడ్డలకు రక్షణేదంటూ తేజస్విని బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు.

దిశ స్ఫూర్తిగా ఏడు రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం:
విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఇది చాలా బాధాకరం అన్నారు. ఇటువంటి ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఈ కేసు సీపీ స్వీయ పర్యవేక్షణలో జరిగేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. దిశ స్ఫూర్తిగా ఏడు రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామన్నారు.
బాధితురాలి కుటుంబసభ్యులకు డీజీపీ సవాంగ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చిన్నారులు, మహిళలపై దాడులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ శాఖ ఉపేక్షించదని హెచ్చరించారు.

సమాజంలో జరుగుతున్న వింత పోకడలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు డీజీపీ.

Related Posts