లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

చిట్టి చీమలు-గట్టి సందేశం : భౌతిక దూరం పాటిస్తూ..శానిటైజ్ చేసుకునే చిన్ని ప్రాణుల్ని చూసి నేర్చుకోవాల్సిందే

Published

on

Ant Constantly social distance and sanitization : చిన్ని చిన్ని చీమల్ని పరిశీలిస్తే వాటినుంచి మనుషులు నేర్చుకోవాల్సింది చాలానే ఉంటాయి. శ్రమకు మారుపేరుగా నిలిచే చీమల్ని చూసి సోమరిపోతుల్లా జీవించే మనుషులు సిగ్గుపడాల్సిందే. నిరంతరం పనిచేస్తునే ఉంటాయి చీమలు. అంతేకాదు క్రమశిక్షణకు మారు పేరు అవి. చక్కగా ఓకే లైన్ లో వెళతాయి. ఒక క్రమ పద్ధతిలో ఒకదానికొకటి సందేశాలిచ్చుకుంటూ తమ పనిని చాలా క్రమశిక్షణతో చేస్తాయి.


 

అమ్మాయిల వివాహ వయస్సు పెరిగితే ఆదాయం పెరుగుతుంది : SBI


‘‘భౌతిక దూరాన్ని’’ పాటించే చీమలు
భూమిమీద ఉండే జీవరాశుల్లో 15 నుంచి 20 శాతం చీమలే ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. చీమలు అంటు వ్యాధుల్ని ముందే గుర్తిస్తాయట. అటువంటి సమయంలో చీమలు సమూహం వ్యవహరించే తీరులో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అంటువ్యాధులు వచ్చినప్పుడు చీమలు ‘‘భౌతిక దూరాన్ని’’ కచ్చితంగా పాటిస్తాయని తెలిపారు. ఈ కరోనా కాలంలో మనం చీమల నుంచి ‘‘భౌతిక దూరాన్ని’’ పాటించాలని చెబుతున్నారు పరిశోధకులు.


 

శానిటైజేషన్‌ చేసుకునే చీమలు
ఈ కరోనా కాలంలో మనకు కొత్తగా శానిటైజేషన్‌ అలవాటుగా మారింది. అలాగే భౌతిక దూరం అనే ప్రక్రియ కూడా మొదలైంది. కానీ చీమలకు ఈ భౌతిక దూరం ఎప్పుడూ పాటిస్తాయని అది చీమల జీవింతంలో నిత్యకృత్యమని తెలిపారు. అంటువ్యాధుల్ని ముందుగానే గుర్తించే చీమలు ఆ అంటువ్యాధులు ప్రబలకుండా చీమలు భౌతిక దూరాన్ని నిరంతరం పాటిస్తాయి. చీమలు తమ సమూహంలోని చీమలకు ఏదైనా వ్యాధి సోకితే దాన్ని దగ్గరకు రానీయవట. అలాగే.. బటయనుంచి లోపలికి వచ్చే ముందు ఒకదానిపై ఒకటి రసాయనం చల్లుకొని శానిటైజ్‌ చేసుకుంటాయట.

ఆరోగ్యం విషయంలో చీమల జాగ్రత్తలు
పరిశోధకులు 11 చీమల సమూహాలపై వ్యాధికారకాన్ని వదిలారు. వీటిని పసిగట్టిన చీమలు వేరే సమూహంతో కలవడం మానేశాయి. సొంత సమూహంలోని చీమలతోనూ భౌతిక దూరం పాటించాయి. వ్యాధి సోకిన చీమలను దూరం పెట్టేశాయి. దీంతో వ్యాధి వ్యాప్తి చెందలేదు. వ్యాధికారకాలు ఎంత తక్కువగా ఉంటే వ్యాధి వ్యాప్తి అంత తగ్గిపోతుందని చీమలు పసిగట్టి అందుకనుగుణంగా ప్రవర్తించడం నేర్చుకున్నాయని తెలిపారు.


చీమలు గూడు కట్టుకోవటం ప్రత్యేక చర్యలు
చీమలు గూడు కట్టుకునే ముందు పక్కా ప్రణాళికతో ఉంటాయి. వ్యాధికారకాలు ప్రవేశించకుండా ఫార్మిక్‌ఆమ్లంను కలిపి గూడును (పుట్ట)నిర్మించుకుంటాయి. మనం ఆపార్ట్‌మెంట్లు, ఇళ్లల్లో గదుల్ని ఎలా శానిటైజ్‌ చేస్తున్నామో చీమలు అలాగే తమ గూడుపై యాంటీమైక్రోబయల్‌ లక్షణాలున్న రసాయనంతో శానిటైజ్‌ చేస్తాయి.

చెట్లకు ఉండే జిగురులో యాంటీమైక్రోబయల్‌ ఉంటుంది. దాన్నీ తీసుకొచ్చి తమ గూటిలో పెట్టుకుంటాయి. దీంతోపాటు వాటి గుడ్లను రక్షించుకునేందుకు వాటి చుట్టూ జిగురుపదార్థంతో కప్పేస్తుంటాయి. ఈ జిగురుపదార్థం విషపూరితమైంది. అందుకే మిగతా జీవులు దాని జోలికి పోవు. దీంతో వాటి గుడ్లను సురక్షితంగా ఉంచుకోగలవు.


వ్యాధి సోకిన చీమలకు దూరం..
చీమలు సమూహంలోని ఏ చీమకైనా వ్యాధి సోకితే వెంటనే దాన్ని నిర్ధాక్షిణ్యంగా దూరంపెట్టేస్తాయి. అలా అవి తమ సమూహంలో వ్యాధి ప్రబలకుండా చూసుకుంటాయి. ఒకే సమూహంలోని చీమలనైనా అవి దగ్గరకి అస్సలు రానీయవు. ఒక్కోసారి వాటిని చంపేస్తాయికూడా.

సహకారంతో శానిటేషన్ చేసుకునే చీమలు
సాధారణంగా చీమలు నాలుగు రకాలు ఉంటాయి. రాణి చీమలు, శ్రామిక చీమలు, కాపలా చీమలు, సైనిక చీమలు. ఇందులో శ్రామిక చీమలు అంటే కూలి చీమలు బయటకు వెళ్లి ఆహారాన్ని సేకరించి తీసుకు వస్తూ ఉంటాయి.అవి ఆహారాన్ని తీసుకొని పుట్ట లోపలకు వచ్చేటప్పుడు సైనిక చీమలు వీటిపై ఫార్మిక్ ఆమ్లంని స్ప్రే చేస్తాయి అంటే శానిటేషన్ చేస్తాయి.


Covid ను ఎదుర్కోవాలంటే చీమల నుంచి మనం కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె తన పరిశోధనలో పేర్కొన్నారు.మరి చిట్టి చీమలు మనుషులకంటే ఎంతో మేలనే విషయం నిజమే కదూ..ఈ కరోనా కాలంలో చీమల్ని చూసి నేర్చుకుని మనం కూడా ఆరోగ్యంగా ఉందాం..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *