7 అంతస్తులు, రూ.95లక్షలు.. అంతర్వేది స్వామివారి కొత్త రథం డిజైన్ రెడీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారికి కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైంది. శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తులో, 7 అంతస్తులు, ఆరు చక్రాలతో నూతన రథం డిజైన్‌ సిద్ధం చేశారు. కొత్త రథం నిర్మాణతో పాటు షెడ్డు మరమ్మతులు, షెడ్డు షెట్టర్ నిర్మాణానికి 95 లక్షల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఫిబ్రవరిలో జరిగే స్వామివారి కల్యాణోత్సవాల నాటికి రథం సిద్ధం చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇక రథం ఆకృతిపై చర్చించి.. ప్రభుత్వానికి ఆలయ అధికారులు నివేదిక సమర్పించనున్నారు.

అంతర్వేది ఆలయ ఆవరణలో స్వామి వారి దివ్య రథం దగ్ధమైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో శనివారం (సెప్టెంబర్ 5) అర్ధరాత్రి దాటాక అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి సుమారు 1.45 గంటల సమయంలో స్వామి వారి రథం మంటల్లో దగ్ధమవుతున్న విషయాన్ని గమనించిన కాపాలదారు, స్థానికులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఈ అగ్ని ప్రమాదానికి కారణాలుగా చెబుతున్న అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కొంత మంది తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న తేనెతుట్టెను తొలగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి రథం దగ్ధమైందనేది ఒక వెర్షన్. ఆలయ పరిసరాల్లో ఓ మానసిక రోగి తిరుగుతున్నాడని.. ఘటనలో అతడి ప్రమేయం కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతకుముందు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు.

పూర్వకాలం నుంచి అందుబాటులో ఉన్న రథం శిథిలమైన తర్వాత 1960లో దేవతామూర్తుల ఆకృతులతో టేకు కలపతో 40 అడుగుల ఎత్తున కొత్త రథాన్ని నిర్మించినట్లు అంతర్వేది ఆలయ సిబ్బంది తెలిపారు. ఉత్సవాల అనంతరం రథాన్ని ఆలయం వద్ద 45 అడుగుల ఎత్తయిన ఆర్‌సీసీ భవనంలో ఉంచి, ముందు భాగంలో తాటాకులతో రక్షణ కల్పిస్తున్నారు. ఈ భవనానికి విద్యుత్తు సౌకర్యం లేనందున షార్ట్‌సర్క్యూట్‌కు అవకాశం ఉండదని, అగ్నిప్రమాదం ఎలా జరిగిందని భక్తులు ప్రశ్నించారు. తేనెతుట్టె అంశం మరిన్ని సందేహాలకు తావిస్తోంది.

దీపం వెలిగించి నిరసన తెలిపిన పవన్..వదిన సురేఖ మద్దతు


ఈ ఘటనపై భక్తులు, పలు ఆలయాల అర్చకులు, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, తదితర హిందూ సంఘాలకు చెందిన సభ్యులు, బీజేపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఏదో కుట్ర కోణం ఉందని అరోపిస్తున్నారు. ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, ప్రాచీన దేవాలయాల్లో రథాలు ఎందుకు కాలుతున్నాయ్ అనే విషయంపై సమగ్ర దర్యాప్తు చేయకుండా కొన్ని సంస్థలు కాకమ్మ కథలు చెబితే మనం నమ్మడానికి వీల్లేదని ధార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. ఇందులో కుట్ర కోణాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వేల దేవాలయాల్లో రథాలు బయటే ఉంటాయని.. వాటికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని సూచించారు. అలాంటి ప్రాచీన రథాలకు వెంటనే మరమ్మతు కూడా చేయాలని కోరారు.

READ  ఏపీలో రైతుబజార్లలో సామాజిక దూరం, కరోనా కట్టడికి పాటించాల్సింది ఈ సూత్రాన్నే

Related Posts