లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

యాంటీ COVID-19 నాజల్ స్ప్రే రెడీ

Published

on

ముక్కులో స్ప్రేగా వాడే యాంటీ కొవిడ్ 19 వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో రెడీ అయింది. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ రీసెర్చర్లు డెవలప్ చేసిన వ్యాక్సిన్ వాడకానికి ఆటంకాలన్నింటినీ క్లియర్ చేసుకుంది. హెల్త్ కేర్ టెక్నాలజీస్ ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీకి చెందిన టీం అప్రూవ్ పొందిన కాంపౌండ్లతో స్ప్రేను రెడీ చేసింది.

ఈ మెటేరియల్స్ మెడికల్ డివైజెస్ లో, మెడిసిన్, ఫుడ్ ప్రొడక్ట్స్ లో విస్తృతంగా వాడుతున్నారు. నార్మల్ పద్ధతుల్లో కొత్త ప్రొడక్ట్ ను మార్కెట్లోకి తీసుకురావడం కొంచెం పనితో కూడుకున్నదే కానీ, మార్కెట్లో ఉన్న మెటేరియల్ తో తయారుచేయడం త్వరగా అయ్యేపని.ఈ స్టడీలో సెల్ కల్చర్ పై జరిగిన ప్రయోగంలో ఇన్ఫెక్షన్ పై ఎలా పోరాడుతుందనేది గమనించారు. కణాల స్వభావం గురించి చేసిన ప్రయోగంలో ఈ వ్యాక్సిన్ 48గంటల పాటు పనిచేస్తుందని.. ఇతర ద్రావణాల్లో ఎన్ని సార్లు కలిసినప్పటికీ అలాగే ఉంటుందని చెబుున్నారు.

రెండు పాలీసాచరైడ్ పాలీమర్స్ కాంబినేషన్ తో స్ప్రే రెడీ అయింది. అందులో మొదటిది కార్రేజీనన్. దీనిని సాధారణంగా ఫుడ్స్ లో చిక్కపడటానికి వాడతారు. రెండో సొల్యూషన్ గెల్లాన్. ఇది ముక్కులో ఉన్న కణాలకు అతుక్కుని ఉండటానికి రెడీ చేశారు.

పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్ విరాళమివ్వనున్న కెనడా


గెల్లాన్ అనేది చాలా ముఖ్యమైన పదార్థం. ఎందుకంటే ముక్కు కుహరంలోకి స్ప్రే చేసినప్పుడు అక్కడి తలాన్ని పూర్తిగా కవర్ చేస్తుంది. అనుకున్న ప్రదేశంలో అంటిపెట్టుకుని ఉంటుంది. ముక్కులో నుంచి కిందకు పడిపోకుండా ఉంటుంది.

‘ఈ స్ప్రేను రెడీగా ఉన్న అందుబాటులోని ప్రొడక్ట్స్ తో సిద్ధం చేశారు. వీటిని ఫుడ్ ప్రొడక్ట్స్, మెడిసిన్స్ లలో వాడతారు. మా డిజైనింగ్ ప్రొసెస్ లో దీన్ని కావాలనే వాడాం. వీటి ద్వారా కొద్ది వారాల్లోనే పెద్ద మొత్తంలో రెడీ చేయగలం’ అని రచయిత డా. రిచర్డ్ మోక్స్ అంటున్నారు.
ఈ స్ప్రే రెండు రకాలుగా పనిచేస్తుంది. మొదటిది ముక్కులో అంటిపెట్టుకుని ఉండి వైరస్ పై పోరాడటంతో ఇన్ఫెక్షన్ బయటకు వచ్చేస్తుంది. మింగడం ద్వారా, ముక్కు చీదడం ద్వారా క్లీన్ అయిపోతుంది. రెండోది శరీరంలో ఉన్న వైరల్ లోడ్ ను తగ్గిస్తుంది. ఒకవేళ ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా అతనిలోని వైరస్ రెండో వ్యక్తికి వ్యాప్తి జరిగినా అతనిలోని వైరస్ ను కూడ తగ్గిస్తుంది.

రోజుకు వందల కొద్దీ లీటర్ల గాలిని ఫిల్టర్ చేస్తుంటాయి ముక్కు కుహరాలు. కాబట్టే ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వలేవు. ఒకవ్యక్తి నుంచి మరోవ్యక్తికి అందుకే వైరస్ త్వరగా వ్యాపిస్తుంది. ఈ వ్యాక్సిన్ వైరస్ సోకిన వ్యక్తితో పాటు అతని ద్వారా వ్యాపించిన వ్యక్తిలోని వైరస్ ను కూడా బలహీనపరుస్తుంది.
ఈ స్ప్రే గుంపులుగా ఉండే ప్రదేశాలు విమానాల్లో, క్లాస్ రూమ్స్ లో బాగా ఉపయోగపడుతుంది. దీనిని రెగ్యూలర్ గా వాడటం వల్ల జబ్బు వ్యాప్తిని అడ్డుకోగలం అని అంటున్నారు. వ్యాక్సిన్ తో పాటుగా మాస్క్, హ్యాండ్ వాష్ వంటి పద్ధతులు తప్పక పాటించాలని.. ఇది సేఫ్టీకి సెకండ్ లేయర్ గా మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *