లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

అమితాబ్, శ్రీదేవి, రజినీల రేర్ పిక్ చూశారా!

Published

on

Throwback Pic: బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, అతిలోక సుందరి శ్రీదేవి, సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌లతో కలిసి ఉన్న Throwback Pic ని విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ ఫ్లాష్‌బ్యాక్ ఫ్రైడే పేరుతో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఈ స్టార్స్ అందరూ న్యూయార్క్ వెళ్లినప్పుడు తీసిన ఫొటో అది.

1991 లో అమితాబ్, రజినీ, గోవిందా, అనుపమ్ ఖేర్, శిల్పా శిరోద్కర్ (నమ్రత శిరోద్కర్ సోదరి) ప్రధాన పాత్రధారులుగా ముకుల్ ఎస్.ఆనంద్ దర్శకత్వంలో ‘హమ్’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషనల్ టూర్స్‌లో భాగంగా ‘హమ్’ టీమ్ న్యూయార్క్ వెళ్లారు.

HUM

వారికి శ్రీదేవి కూడా జతకలిశారు. స్థానిక జెయింట్స్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అమితాబ్, శ్రీదేవి ‘జుమ్మా చుమ్మా’ పాటకు కాలు కదిపి ప్రేక్షకులను అలరించారు.
శ్రీదేవి పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ లైవ్ కాన్సెర్ట్ ఇదే కావడం విశేషం. బిగ్ స్టార్స్‌తో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసి అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు అనుపమ్ ఖేర్.