పాయల్‌ లైంగిక ఆరోపణలపై కశ్యప్ రియాక్షన్.. నన్ను ఏం చెయ్యలేరు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను బలవంతం చేయబోయాడని, నటి పాయల్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఇటీవల తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపట్ల ఓ దర్శకుడు ఎలా ప్రవర్తించాడనే విషయాన్ని పాయల్‌ ఘోల్‌ వివరించారు. ఆ సమయంలో ఆమె దర్శకుడి పేరు చెప్పలేదు. ఇప్పుడు తనపై బలవంతం చేసిన దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ అంటూ వెల్లడించింది పాయల్‌ ఘోష్‌. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ట్వీట్‌ను కూడా ఆమె చేశారు.

ఇదిలా ఉంటే తనను బలవంతం చేసినట్లు నటి పాయల్ ఘోష్ చేసిన తీవ్రమైన ఆరోపణలపై బాలీవుడ్ చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా పాయల్ ఆరోపణలు నిరాధారమైనదిగా అభివర్ణించాడు అనురాగ్ కశ్యప్. అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేస్తూ.. “నా నోరు మూయించడానికి మార్గం వెతుక్కోవడానికి మీకు ఇంత సమయం పట్టిందా? అయినా మీరు నన్ను ఏం చెయ్యలేరు. ఎవరూ కూడా నా నోరు మూయించలేరు. ఒక మహిళగా ఉండి మీరు నాపై ఆరోపణలు చేసేందుకు ఇతర మహిళలను వివాదంలోకి లాగారు. ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటుంది మేడమ్. మీ ఆరోపణలన్నీ నిరాధారమైనవి. అంటూ ట్వీట్ చేశారు.


తన తర్వాతి ట్వీట్‌లో.. “నాపై ఆరోపణలు చేసే ప్రక్రియలో మీరు నాతోటి నటీనటులను, బచ్చన్ కుటుంబాన్ని లాగడానికి ప్రయత్నించారు. కానీ అందులో మీరు విఫలమయ్యారు. మేడమ్.. నాకు రెండుసార్లు పెళ్లి అయ్యింది. అది నా నేరం అయితే నేను అంగీకరిస్తాను. కానీ నా మొదటి భార్యను చాలా ప్రేమించాను.. దానిని కూడా నేను అంగీకరిస్తాను.. నా మొదటి భార్య కానీ, రెండవ భార్య కానీ, లవర్ కానీ, నాతో పనిచేసిన నటీనటులు, ఎవరైనా వారు మహిళలు, వారంతా పబ్లిక్‌గా ప్రైవేట్‌గా నేను కలిసిన మహిళలు.. అంతమాత్రాన నేను వారితో తప్పు చేశాను అనడం కరెక్ట్ కాదని ట్వీట్ చేశారు.


తన తర్వాతి ట్వీట్‌లో, అనురాగ్ కశ్యప్.. “నేను మీరు చెప్పినట్లుగా ఎప్పుడూ ప్రవర్తించను, అలా ప్రవర్తించేవారిని కూడా నేను ఎప్పుడూ సహించను. మీరు చెప్పిన వీడియోల్లో ఎంత నిజం చెప్పారు. ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు అనేదానిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీకు ప్రేమతో నా ఆశిస్సులు. మీ ఇంగ్లీషుకు నా హిందీలో సమాధానం ఇచ్చినందుకు క్షమించండి. ”


దీనితో పాటు అనురాగ్ కశ్యప్ తనకు చాలా కాల్స్ వస్తున్నాయని తనకు ఈ విషయం గురించి మాత్రం ఎటువంటి ఫోన్లు చెయ్యొద్దని అనురాగ్ కశ్యప్ అన్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని అన్నారు. మరోవైపు పాయల్ ట్విట్టర్‌లో అనురాగ్‌ కశ్యప్‌ నాపై చాలా తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడిని, నరేంద్ర మోడీజీ.. ఈ విషయంలో చర్య తీసుకుని కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టాలని పాయల్ కోరారు. ఇలా చెప్పడం వల్ల తనకు హానికరమని, నా భద్రతకు ముప్పు ఉందని, సాయం చేయండి’ అని కోరారు.

Related Posts