స్పెషల్ డే.. స్వీటీ ఫ్యాన్స్ స్పెషల్ విషెస్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Anushka International Day of Sign Languages: అనుష్క శెట్టి, ఆర్. మాధవన్ మరియు అంజలి ప్రధాన పాత్రల్లో నటించగా, షాలిని పాండే, సుబ్బరాజు మరియు శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్‌.. ‘నిశ్శబ్దం’.. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మైఖేల్ మాడ్సన్ (వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, కిల్ బిల్, రిజర్వాయర్ డాగ్స్) ఈ చిత్రం ద్వారా భారతీయ సినిమా పరిశ్రమకు పరిచయమవుతున్నారు..


ఇదిలా ఉంటే ఈరోజు 23 సెప్టెంబర్ ‘ఇంటర్నేషనల్‌ సైన్‌ లాంగ్వేజెస్ డే’.. ఈ సదర్భంగా అనుష్క ఫ్యాన్స్‌ హ్యాపీ ‘ఇంటర్నేషనల్‌ సైన్‌ లాంగ్వేజెస్ డే’ అంటూ విషెస్ తెలియచేస్తున్నారు. వారు ప్రత్యేకంగా ఇలా అభినందనలు చెప్పడానికి రీజన్.. అనుష్క ‘నిశ్శబ్దం’ చిత్రం.


మాటలురాని మరియు వినికిడి లోపం ఉన్న కళాకారిణి సాక్షి అనే దివ్యాంగురాలి పాత్రలో నటించారు. ఈ పాత్ర కోసం అనుష్క ప్రత్యేకంగా అమెరికన్ సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నారు. ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌‌కు అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌కు తేడా వుంటుంది.


‘నిశ్శబ్దం’ సినిమా అమెరికా నేపథ్యంలో వుండడంతో, ఆ సైన్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసి మరీ నటించారు అనుష్క. అలాగే ఈ చిత్రం కోసం పెయింటింగ్ కూడా నేర్చుకున్నారామె. అందుకే ‘ఇంటర్నేషనల్‌ సైన్‌ లాంగ్వేజెస్ డే’ సందర్భంగా స్వీటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా తమ విషెస్ తెలుపుతున్నారు. ‘నిశ్శబ్దం’.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో.. అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల కానుంది.

Related Tags :

Related Posts :