Home » కోహ్లీ సాయంతో అనుష్క శీర్షాసనం!
Published
2 months agoon
By
sekharAnushka Sharma:
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కపుల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. జనవరిలో అనుష్క పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవల బేబి బంప్ పిక్ పోస్ట్ చేసింది అనుష్క. అయితే ఆమె గర్భవతిగా ఉన్నప్పటికీ వ్యాయామం, యోగా వంటివి చేస్తూనే ఉంది.
రీసెంట్గా భర్త కోహ్లీ సాయంతో శీర్షాసనం వేస్తున్న త్రో బ్యాక్ పిక్చర్ షేర్ చేసిన అనుష్క ‘నా లైఫ్లో యోగాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి గర్భంతో ఉన్నప్పటికీ యోగా చేసుకోవచ్చన వైద్యులు సూచించారు. దాంతో ఇంతకుముందులానే అన్ని ఆసనాలూ వేస్తున్నాను. నా ప్రియమైన భర్త కోహ్లీ సాయంతో శీర్షాసనం కూడా వేశాను’ అని తెలిపింది.