ap assembly budjet meetings from tommorow

కరోనా కాలంలోనూ జగన్  భారీ బడ్జెట్…నవరత్నాలకే  అగ్ర స్థానం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం (జూన్ 16, 2020) నుంచి జరుగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సాధారణ, వ్యవసాయ బడ్జెట్‌లను మంత్రులు వరుసగా ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో సాధారణ బడ్జెట్‌ను డిప్యూటి సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టనున్నారు.

గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ప్రసంగం, బీఏసీ సమావేశం ఉంటుంది. అనంతరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రూ. 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది అంతకంటే ఎక్కువ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సారి బడ్జెట్‌లో కూడా సంక్షేమ పథకాలు, నవరత్నాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌పై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి  అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

16న ఉదయం 10 గంటలకు వర్చువల్‌ కాన్ఫరెన్సింగ్‌ ద్వారా గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. ఉదయం 11:30 గంటలకు స్పీకర్‌ అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశం జరుగనుంది. అనంతరం తిరిగి సభ ప్రారంభం కానుంది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం- చర్చ ఉంటుంది. గవర్నర్‌ ప్రసంగంపై ముఖ్యమంత్రి సమాధానం చెబుతారు. 12:30 గంటల నుంచి 1 గంట మధ్యలో ప్రస్తుత వార్షిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను సభలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నారు. సాధారణ బడ్జెట్‌ అనంతరం సభలో ఆ శాఖ మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నారు. 

శాసనమండలిలో  వ్యవసాయ బడ్జెట్‌ / పద్దును మండలిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రతిపాదించనున్నారు. 17న ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. సాధారణ బడ్జెట్‌పై పరిమిత స్థాయిలో చర్చ జరుగనుంది. చర్చకు మంత్రి సమాధానాలు చెబుతారు. బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. సభ వాయిదా పడుతుంది. 18న అసెంబ్లీ / మండలి సమావేశాలు ఉండవు. రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్లు మాత్రమే ఉంటాయి. 19న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ జరుగనుంది. లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. గెలుపొందిన సభ్యుల స్పందనలు ఉంటాయి. 
 

Related Posts